భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్‌తో ప్రారంభించినా మెల్లగా నిత్యావసర వస్తువుల దగ్గరకు వస్తున్నారు. తమకు ఒక్క చాన్స్ ఇస్తే చీప్‌లిక్కర్‌ను రూ. 50కే అమ్ముతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విపక్షపార్టీలకు బీజేపీని విమర్శించడానికి.. ట్రోల్ చేయడానికి ఇదో అస్త్రం అయిపోయింది. ముందుగా పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తవుల ధరల సంగతి చూడాలని.. అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీంతో సోము వీర్రాజు మరోసారి తన బుర్రకు పదనును పెట్టి.. చీప్ లిక్కర్ కన్నా చీప్‌గానే సన్నబియ్యం ఇస్తామని ప్రకటించేశారు.
Also Read: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
నిత్యావసర వస్తువుల ధరలను బీజేపీ ఏపీలో అధికారంలోకి రాగానే కంట్రోల్ చేస్తుందని ప్రజలకు అన్ని తక్కువ ధరకే ఇస్తామని ప్రకటించారు. బిజెపి అధికారంలోకి వస్తే సన్నబియ్యం కిలో 40రూపాయల కు వినియోగదారుల కు అందిస్తామని.. అదే విధంగా టమోటా, ఉల్లి వంటి కూరగాయల ధరలు నియంత్రిస్తామన్నారు. జీవోలు ఇచ్చి వీటి ధరలు తగ్గిస్తే మరి రైతుల పరిస్థితేమిటి అన్న డౌట్ వస్తుంది కాబట్టి సోము వీర్రాజు దానికీ క్లారిటీ ఇచ్చారు. రైతులకు సహకారం ,గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. ఇక సబ్సు,పేస్ట్ తో సహ ఇతర వస్తువుల ధరలను కూడా తగ్గిస్తామని ప్రకటించారు. వీటననింటిపై తాము ఆషామాషీగా మాట్లాడటం లేదని.. తమ ప్రణాళికను ప్రకటిస్తామని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.
Also Read: పవన్‌ను పదే పదే టార్గెట్ చేస్తున్న సోము వీర్రాజు ! బీజేపీ -జనసేన మధ్య దూరం పెరుగుతోందా ?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం నిత్యావసర వస్తునుల ధరలను అదుపు చేయలేకపోయిందని సోము వీర్రాజు మండిపడ్డారు. ధరలను నియంత్రించాలన్న అంశంపై వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని తరచుగా ప్రశ్నిస్తున్నా జగ్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సేమ్ ఇదే పద్దతిలో వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా సోమువీర్రాజుపై రెండు రోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను విపరీతంగా పెంచడం వల్లే నిత్యావసరవస్తునుల ధరలు పెరిగాయని ఎందుకు తగ్గించరని అడుగుతున్నారు.
Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే
అయితే సోము వీర్రాజు తాజాగా చేసి రూ. నలభైకి సన్న బియ్యం వ్యాఖ్యలపైనా ట్రోలింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే సోనామసూరి బియ్యం ఇప్పుడు కిలో రూ. నలభై కంటే తక్కువే ఉన్నాయి. బ్రాండ్‌లు వేసి అమ్ముకునేవారే ఎక్కువకు అమ్ముతున్నారు. మార్కెట్ రేటు కంటే ఎక్కువ చెప్పడం .., దాన్ని గొప్పగాప్రకటించుకోవడం ఒకటి అయితే.. అసలు ఏపీలో అమల్లో ఉన్న కిలో రూపాయి బియ్యం పతకాన్ని సోము వీర్రాజు ఎత్తేస్తారా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ సోము వీర్రాజుకు చికాకు తెప్పించే ప్రశ్నలే. కానీ సమాధానం చెప్పాల్సిందే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి