తాగుబోతుల సంఘానికి సోమువీర్రాజు అధ్యక్షుడుగా అయ్యాడని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. ఇవాళ (డిసెంబరు 30) ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఏపీ మంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యే ఆదిమూలం స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలపలకు వచ్చిన ఆయన బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పేదలందరికి అండగా నిలుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.
చీప్ లిక్కర్ 50 రూపాయలకు ఇచ్చి ప్రజలను సోమువీర్రాజు సంతోష పెడతాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోము వీర్రాజును ఎలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశారో అర్థం కావడం లేదని, సారాయిని ఇచ్చి ఎవరైనా డబ్బులు అడుగుతారా, సారాయి ఇచ్చి ఏవరైనా ఓట్లు అడుగుతారా? అని ఆయన ప్రశ్నించారు. సోము వీర్రాజు వ్యక్తిత్వం ఏంటో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారని అన్నారు. మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం సోము వీర్రాజు చేయడం బాధాకరం అని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపడం ఎవరి తరం కాదని, జగన్మోహన్ రెడ్డిపై భగవంతుడు, ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఎలాంటి చిన్న తప్పు చేయలేదని, అన్ని పార్టీలు ఒకటై జగన్మోహన్ రెడ్డిపై కుట్ర పన్నుతున్నట్లు ఆయన మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ధనంవంతులు అందరికి మంచి జరుగుతుందనే అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. తాగుబోతులకు సోమువీర్రాజు అధ్యక్షుడు అయ్యాడని అన్నారు. సోమువీర్రాజు లాంటి వ్యక్తులకు అధ్యక్ష పదవి ఇస్తే డిపాజిట్ కూడా రాదని తాను మోదీకి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన విమర్శించారు.
Also Read: Vangaveeti Radha Scooter : వంగవీటి రాధా ఆఫీసు వద్ద అనుమానాస్పద స్కూటర్ కలకలం ! ఎవరిది అది?
Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి