వంగవీటి రాధా  కార్యాలయం ముందు పార్క్ చేసి ఉన్న ఓ స్కూటర్ కలకలం రేపింది. అది రాధా అనుచరులెవరిదీ కాకపోవడం..  కొద్ది రోజులుగా అక్కడే ఉండటంతో వంగవీటి రాధా అనుచరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పదం ఉన్న ఆ స్కూటర్‌ను తనిఖీ చేసి అక్కడి నుంచి తరలించారు. ఆ స్కూటర్ ఎవరిది? ఎప్పుడు తెచ్చి పెట్టారు..? ఎందుకు అక్కడే ఉంచారు ? అన్న వివరాలపై ఆరా తీస్తున్నారు. వంవీటి రంగా వర్థంతి రోజున తన పై దాడికి రెక్కీ నిర్వహించారని రాధాకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నుంచి బెజవాడ రాజకీయం హాట్ హాట్ గా మారింది. 


Also Read: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో జిన్నా టవరా .. కూల్చేయాల్సిందే! బీజేపీ డిమాండ్‌తో కలకలం...


వంగవీటి రాధాకృష్ణ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన వారంటూ పోలీసులు కొంత మందిని ప్రశ్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ అంశంపై రెక్కీ నిర్వహించిన కారు అంటూ సోషల్ మీడియాలోనూ కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు ప్రభుత్వం, పోలీసులు కూడా అప్రమత్తమయి..   వంగవీటి రాధాకృష్ణకు టూ ప్లస్ టూ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే వంగవీటి మాత్రం తనకు పోలీస్ సెక్యూరిటీ వద్దని... తన రక్షణను రంగా అభిమానులే చూసుకుంటారని చెబుతున్నారు. 


Also Read: ఏపీలో 'ఆర్ఆర్ఆర్'కు ఇది ప్లస్సే... మరి, టికెట్ రేట్స్ సంగతి?


మరో వైపు వంగవీటి రాధాకృష్ణ చేసిన రెక్కీ ఆరోపణలను పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని డీజీపీ గౌతం సవాంగ్ వ్యాఖ్యానించారు. ఓ వ్యక్తి అపోహతో చేసిన ఆరోపణలపై టీడీపీ రాజకీయం చేస్తోందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల కారణంగా వంగవీటి రాధాకృష్ణ ఇల్లు, కార్యాలయం చుట్టూ ఏది అనుమానాస్పదంగా కనిపించినా వివాదాస్పదం అవుతోంది.  రాజకీయంగా కూడా సున్నితమైన అంశం కావడంతో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు .


Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్


Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి