తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే... తమన్ పేరు వినిపిస్తోంది. సాంగ్స్ మాత్రమే కాదు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా బాగా ఇస్తాడని పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే... త‌మ‌న్‌కు, నానికి మ‌ధ్య ఎక్క‌డో చెడింద‌ని ఇండస్ట్రీ గుసగుస. 'టక్ జగదీష్' సినిమాకు త‌మ‌న్‌కు సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. సాంగ్స్ ఆయనే చేశారు. ఆ తర్వాత ఎందుకో త‌మ‌న్‌ను తప్పించి గోపీసుంద‌ర్‌ను తీసుకొచ్చారు. ఆయనతో నేపథ్య సంగీతం చేయించారు. నేపథ్య సంగీతంలో భాగంగా దర్శకుడు శివ నిర్వాణ రాసిన ఓ పాటను కూడా ఆయనే స్వరపరిచారు. అప్పుడే నాని, తమన్ మధ్య గొడవలు ఉన్నాయనే గుసగుసలు వినిపించాయి. తాజాగా తమన్ చేసిన ట్వీట్స్, అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో నాని చెప్పిన విషయానికి కౌంటర్ అని నెటిజన్స్ భావిస్తున్నారు.

"సినిమాను సాంగ్ ఎలివేట్ చేసేలా ఉండాలి. డామినేట్ చేయకూడదు. పాట మాత్రమే కాదు, ఏదైనా సరే... యాక్టింగ్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, మ్యూజిక్ గానీ డామినేట్ చేసిందనుకోండి? ఒక్కటి మాత్రమే బాగా బయటకు కనపడుతోందని అనుకోండి? ఏదో తప్పు ఉందని లెక్క. సరిగా లేదని అర్థం. అన్నీ కలిసి సినిమాను గొప్ప సినిమా అనిపించేలా చేయాలి. నేను అదే నమ్ముతాను" అని 'శ్యామ్ సింగ రాయ్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని అన్నారు.Also Read: Tollywood 2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!తమన్ చేసిన ట్వీట్ విషయానికి వస్తే... "అన్ని శాఖలు అద్భుతమైన పనితీరు కనబరిచినప్పుడు, దానిని కంప్లీట్ ఫిల్మ్ అని మేం అంటాం. ఎప్పుడూ ఒకరు డామినేట్ చేశారని అనరు. బాగా నవ్వొస్తోంది. సినిమాను అర్థం చేసుకోవడానికి లోతైన అవగాహన అవసరం. డైలాగుల్లో డెప్త్, నెక్ట్స్ సీక్వెన్స్‌లోకి స్మూత్‌గా వెళ్లే నేరేష‌న్‌, గ్రేట్ విజువలైజేషన్, గ్రేట్ క్యారెక్టరైజేషన్, ఎమోష‌న్స్‌లో నిజాయ‌తీతో చక్కగా రాసిన స్క్రిప్ట్‌కు ప్రోపర్ డైరెక్షన్, నటీనటుల అద్భుత అభినయం తోడు అయినప్పుడు... సినిమా ఎప్పుడూ వన్ మ్యాన్ షో కాదు. మేం సినిమాను ప్రేమిస్తాం, సినిమా కోసం పని చేస్తాం" అని తమన్ ట్వీట్ చేశారు. ఇది నానిని ఉద్దేశించి చేసిన ట్వీట్ అని నెటిజన్స్ ఫీలింగ్. గతంలో 'టక్ జగదీష్' నుంచి తమన్ తప్పుకోవడంతో ఇప్పుడీ విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. అదీ సంగతి! 

Also Read: ప్రేమ‌క‌థ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వ‌చ్చింది? రాజ‌మౌళి వైఫ్ చేసిందేమిటి?Also Read: Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!Also Read: మ‌హేష్‌తో సినిమా... స్క్రిప్ట్ సిట్టింగ్స్ గురించి రాజ‌మౌళి రియాక్ష‌న్‌!Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!Also Read: ఎన్టీఆర్‌... రామ్‌చ‌ర‌ణ్‌... ఆర్ఆర్ఆర్... అది ప‌బ్లిసిటీ స్టంటా?ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.