గుప్పెడంత మనసు డిసెంబరు 30 గురువారం ఎపిసోడ్ 


మేడం ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని వసుధార ఎన్నిసార్లు అడిగినా జగతి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వసు ఆవేదనతో అలాగే నిలబడిపోయింది. బుధవారం ఎపిసోడ్ ఇక్కడ క‌్లోజ్ అయి..గురువారం ఎపిసోడ్ ఇక్కడి నుంచే ప్రారంభమైంది.


మహేంద్రతో ఫోన్లో జగతి
కాలేజీకి టైమ్ అవుతోందని బయటకు వచ్చేసిన జగతికి కాల్ చేసిన మహేంద్ర నీ ఆలోచనల్లో ఎందుకు మార్పొంచింది..నీ మనసులో ఏదో పెట్టుకున్నావ్, చెప్పు ప్లీజ్ అంటాడు. దేవయాని అక్కయ్య కారణంగా అందరికీ దూరంగా ఉన్నా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావ్. లేని బంధాలు వెతుక్కుంటూ వచ్చి నరకయాతన పడుతున్నా , నాకు నీ ఓదార్పు మాటలు అవసరం లేదు నన్ను ఒంటరిగా వదిలేయండి, నువ్వు-వసు-రిషి అందరూ నన్ను వదిలేయండి, అందరికీ ఏం చెప్పాలి, నాపై ప్రేమ-గౌరవం ఉంటే నన్ను ఒంటరిగా వదిలేయండి, ఈ టాపిక్ మళ్లీ తీయెద్దు మహేంద్ర అని ఫోన్ కట్ చేస్తుంది. జగతి నుంచి అలాంటి మాటలు ఊహించని మహేంద్ర షాక్ లో ఉండిపోతాడు. ఈ డిస్కషన్ మొత్తం వెనుకనుంచి వసుధార విని కన్నీళ్లు పెట్టుకుంటుంది. 


Also Read:  గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
వసుధార-రిషి
కాలేజీలో ఒంటరిగా కూర్చుని జగతి మేడం అన్నమాటల్ని తలుచుకుంటుంది వసుధార. ప్రతి కష్ట సమయంలోనూ నాకు తోడుగా ఉన్నారు, కానీ ఇప్పుడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, నన్ను ఎవ్వరు ఒక్కమాట అన్నా ఒప్పుకోని మేడం ఇప్పుడు వింతగా, విచిత్రంగా ఎందుకు అంటున్నారని ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి వసుని గమనించి ఎందుకలా ఉన్నావని అడుగుతాడు. ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం కావుకదా అంటుంది. ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అంటాడు రిషి. మనిషికి కూడా ఎక్కడో దగ్గర మనసు విరగక తప్పదు, నీరులా కరిగిపోక తప్పదంటుంది. ధైర్యంగా ఉండే నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావ్ అంటాడు రిషి. నీ పర్సనల్ అయితే ఏం చెప్పొద్దులే అనేసి లేచి వెళ్లిబోతుంటే..జగతి మేడం అన్న వసు మాటలు విని ఆగిపోతాడు. జగతి మేడం ఆలోచనలు, ఆచరణ ఒకేలా ఉంటాయి, మేడం విషయంలో నా నమ్మకం ఎప్పుడూ ఓడిపోలేదు, మొదటి సారి ఎందుకో అలా అనిపిస్తోంది, ఈ మధ్య మేడం కొత్తగా మాట్లాడుతున్నారు, మునుపెన్నడూ లేనట్టుగా ప్రవర్తిస్తున్నారని బాధపడుతుంది. నేను తన దగ్గర ఉండడం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు సార్ అని చెబుతుంది. (రిషి మాత్రం మనసులో అంతా తాను అనుకున్నట్టే జరుగుతోందనుకుంటాడు) . 


Also Read: పగతీర్చుకున్న రుద్రాణి, షాక్ లో కార్తీక్ -దీప.. కార్తీకదీపం డిసెంబరు 30 గురువారం ఎపిసోడ్
తనకి ఇష్టం లేనప్పుడు నువ్వు అక్కడ ఉండడం అవసరం లేదుకదా అంటాడు రిషి.  ఎక్కడోచోట ఉండడం కాదు నా సమస్య, మేడం కొత్తగా అలా మాట్లాడటమే నమ్మలేకపోతున్నా  అని చెబుతుంది. వెళ్లిపొమ్మని చెప్పారా అని రిషి అడిగితే..అలా చెప్పినా బావుండేది, నా తప్పేంటని అడిగేదాన్ని కానీ చెప్పకనే చెబుతున్నారంటుంది. మనకి ఇష్టం అయిన వాళ్ల మనసు వాళ్లకన్నా మనకే ఎక్కువ తెలుస్తుంది...అది మేడం సహజత్వం కాదు ఆమె అలా ఆలోచించరని క్లారిటీ ఇస్తుంది. ఇవన్నీ తెలిసినప్పుడు వద్దని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నప్పుడు అక్కడే ఉండడం ఎందుకని క్వశ్చన్ చేసిన రిషి..ఏదైనా హాస్టల్లో ఉండొచ్చుకదా అంటాడు. సర్ కాఫీ లేకపోతే టీ తాగొచ్చేమో , భోజనం లేకపోతే టిఫిన్ చేయొచ్చేమో కానీ అన్నింటికీ ఆల్టర్ నేట్ గా ఇంకొకటి ఉండదు సర్, నేను హాస్టల్ కి వెళ్లలేను సర్ అని షాక్ ఇస్తుంది. జగతి మేడం కూడా అంతే..ఆవిడకు ఆల్టర్ నేట్ ఉండదు, ఆవిడ ఒక్కరే... ఆ స్థానంలో నేను ఇంకొకర్ని ఊహించుకోలేనంటుంది. మేడం మాట్లాడే మాటలు అసలు మేడంవే కాదు , నాకు అర్థమవుతున్నాయి, తను అలా మాట్లాడరు, ఎవరో ఏదో అన్నారు ( రిషి మనసులో గిల్టీగా ఫీలవుతాడు), అదెవరో చెప్పడం లేదు, కానీ నేను తెలుసుకుంటాను అంటుంది. 


Also Read: వసుధారతో గౌతమ్ మాట్లాడుతుంటే భరించలేకపోతున్న రిషి, గుప్పెడంతమనసు డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
మేడంని బాధపెట్టను, హాస్టల్ కి వెళ్లను అంటున్నావ్..మరెక్కడి వెళతావ్ అని అడిగిన రిషితో..మేడంని విడిచిపెడితే హాస్టల్ కి వెళ్లేది లేదు, ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు అంటుంది. ఎక్కడినుంచో వచ్చాను, అందర్నీ వదిలేసి మేడంలోనే అందర్నీ చూసుకుంటున్నాను, మేడంకి నావల్ల ఇబ్బంది కలుగుతుందంటే నేను అక్కడ ఉండలేను సార్, చెప్పలేను ఎక్కడికి వెళతానో ఏమో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ మేడం చెప్పినట్టు వినొచ్చు కదా అన్న రిషితో..ఆమె ఏం చెప్పినా వింటాను, నా కోసం మానాన్ననే ఎదిరించారు, నాకోసం ప్రతిసారీ రక్షణగా నిలిచారు..అలాంటి మేడం మనస్ఫూర్తిగా చెబితే వింటాను కానీ ఆమెని ఎవరో వ్యక్తి కట్టిపడేస్తున్నారు. నన్ను వెళ్లిపొమ్మంటున్నారంటే నాకన్నా ఎక్కువగా తను నలిగిపోతున్నారని నాకు అర్థమైంది, నాకన్నా ఎక్కువగా తను బాధపడుతున్నారు, వినిపించే మాటలు మేడంవి కావు సార్ అంటుంది ( వసుని ఇంట్లోంచి హాస్టల్ కి పంపించేయమని జగతికి చెప్పిన మాటలు రిషి గుర్తుచేసుకుంటాడు). నా హెల్ప్ ఏమైనా కావాలా అని అడిగిన రిషితో..వద్దు సార్ ఉంటే మేడం దగ్గర ఉంటా, లేదంటే ఎవ్వరికీ భారం కాకుండా ఎవ్వరి కంటికీ కనిపించకుండా వెళ్లిపోతాను సార్ అంటుంది. నేను ఎక్కడికి వెళ్లినా, ఎక్కడైనా బతికే ధైర్యం నాకుంది సార్ అంటుంది వసు. వసు నుంచి ఇలాంటి సమాధానం ఊహించని రిషి.. ఏంటి ఇలా మాట్లాడుతోందని అనుకుంటాడు. అసలు ఎక్కడికి వెళతావ్, ఏం చేస్తావ్ అని అడిగినా.. నేను నా మనసు చెప్పింది చేయబోతున్నా అనేసి అక్కడినుంచి వెళ్లిపోతుంది. 


Also Read: వసు విషయంలో రిషికి క్లారిటీ ఇచ్చిన జగతి.. గౌతమ్ ప్రేమకి అడ్డుతగులుతున్న ఈగో మాస్టర్, గుప్పెడంత మనసు డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
జగతి ఇంట్లో
లోపల నుంచి లగేజ్ సర్దుకుంటూ  జగతి మేడం తనకోసం చేసిన ప్రతి సహాయాన్ని గుర్తుచేసుకుంటుంది వసుధార. సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చిన వసుధార జగతి మేడం దగ్గర కాసేపు నిల్చుని అలా బయటకు వెళ్లిపోతుంది. జగతి అటువైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్ లో వసుదార పయనం ఎటు అన్నది తెలుస్తుందేమో చూడాలి.


Also Read: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
Also Read:  కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి