గుప్పెడంత మనసు డిసెంబరు 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే... గడిచిన ఎపిసోడ్ లో వసుధారని ఇంట్లోంచి పంపించేయమన్న రిషి మాటమేరకు జగతి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. వసు ఇచ్చిన కాఫీ పడేసి..నేను కూడా కాలేజికి వస్తామేడం అన్నా పట్టించుకోకుండా జగతి వెళ్లిపోతుంది. వసు డల్ గా బయటనిల్చుంటే రిషి-గౌతమ్ అక్కడకు వస్తారు. శనివారం ఎపిసోడ్ ఇక్కడే మొదలైంది... 


రిషి-గౌతమ్-వసుధార
వసుతో ఆగకుండా మాట్లాడుతున్న గౌతమ్.. ఇంట్లోకి పిలవ్వా అని అడుగుతాడు. తప్పని పరిస్థితుల్లో రండి అన్న వసుతో..వద్దులే అంటాడు రిషి. గౌతమ్ ఆగకుండా మాట్లాడుతున్నా వసుధార మాత్రం డల్ గానే ఉంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ కోసం ఓ షార్ట్ ఫిలిం అనుకున్నాం కదా ఎక్కడివరకూ వచ్చింది అని రిషి అడగడంతో... ఇంకా పూర్తైనట్టు లేదని చెబుతుంది వసుధార. మేడం నేను చెప్పిన పని మొదలెట్టిందో లేదో తెలియాలంటే ఇన్ డైరెక్ట్ గా అడగాలని అనుకుంటాడు. బయట కారు లేదు మేడం ఇంట్లో లేరా అన్న రిషితో .. మేడం కాలేజీకి వెళ్లారని చెబుతుంది. మరి నువ్వెలా వస్తావని అడిగితే..నేను సౌకర్యాలకు అలవాటు పడలేదని అనేస్తుంది. తమతో రమ్మని అడిగడంతో వసు బయలుదేరుతుంది. వసుని హాస్టల్ కి పంపించే పని ఎంతవరకూ వచ్చిందని మేడంని ఎలా అడగాలనే ఆలోచనలో పడతారు రిషి. కార్లో వాటర్ లేదన్న గౌతమ్ కి వసు బాటిల్ ఇచ్చే ప్రయత్నం చేసినా రిషి అడ్డుకుంటాడు.


Also Read:  మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
మా చిన్నప్పటి విషయాలు రిషి ఏమైనా చెప్పాడా అంటూ గౌతమ్ సందడిగా మాట్లాడుతుంటాడు. మా చిన్నప్పటి విషయాలు ఏమైనా రిషి చెప్పాడా వసుధారా అంటూ... రిషి ఏం చేసినా నాకు చెప్పకుండా చేసేవాడు, నేను మాత్రం చెప్పే చేసేవాడిని అంటాడు. వసు..నీ కుటుంబం గురించి చెప్పు అనడంతో రిషి చిరాకు పడతాడు. ఏదో ఘోరం జరిగినట్టు ముగ్గురం సైలెంట్ గా కూర్చోవాలా అని క్వశ్చన్ చేసిన గౌతమ్ ని కార్లోంచి దించేసి క్యాబ్ లో పంపించేస్తాడు రిషి. ఏ ఒక్క అవకాశం దొరకనివ్వడం లేదని బాధపడతాడు గౌతమ్.


Also Read: రిషి మనసులో ఏముంది.. వసుని ఎందుకు హాస్టల్ కి పంపించేయమన్నాడు, గుప్పెడంత మనసు డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్...
కాలేజీలో తన క్యాబిన్లో కూర్చున్న జగతి.. రిషి చెప్పిన మాటలు-తాను వసుధారని అన్నమాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర.. జగతి నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి అనడంతో..నా మూడ్ బాలేదంటుంది జగతి. మీ మూడ్ ని నేను రిపేర్ చేస్తాకదా అంటాడు. అక్కడి నుంచి లేచి క్యాంటీన్ కి వెళ్లిపోతూ.. అక్కడికి మాత్రం రావొద్దంటుంది. వసుధార ఎదురై మేడం అనడంతో ఆగిన జగతి.. సారీ వసు అని మనసులో అనుకుంటుంది. వసు పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  ఇంతలో మహేంద్ర ఎదురుపడడంతో మేడంకి ఏమైందని అడుగుతుంది వసుధార. టిఫిన్ తినలేదు, లంచ్ తెచ్చుకోలేదని మహేంద్ర చెప్పడంతో వసు ఆలోచనలో పడుతుంది. 


Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
కట్ చేస్తే తన క్యాబిన్లో కూర్చున్న రిషి.. వసుని హాస్టల్ కి పంపించేయమన్న విషయం గుర్తుచేసుకుని..ఎంతవరకూ వచ్చిందో అని అనుకుంటాడు. జగతి మేడంని రమ్మని కబురు పెడతారు. జగతి మేడం నీడలో వసుధార మంచితనం మసకబారిపోతోంది. ముఖ్యంగా పెద్దమ్మ దగ్గర. అందుకే వసుకి సంబంధించి మంచి నిర్ణయమే తీసుకున్నా అని తనని తాను సపోర్ట్ చేసుకుంటాడు. వసుధార గురించి నేను చెప్పింది ఏం చేశారని అడిగిన రిషికి..జగతి సమాధానం చెప్పేలోగా మధ్యలో అడ్డుతగిలిన రిషి..మీరు ఆ పని పూర్తిచేస్తారని అంటాడు. వసుధారని హాస్టల్లో అడ్మిట్ చేసే ఫాం తీసి జగతి ముందు పెడతాడు...అది చూసిన జగతి..వసు మీ దగ్గరకి వచ్చి అడుగుతుంది అప్పుడు ఇవ్వండి. మీరు నాకు చెప్పిన పని త్వరలోనే అయిపోతుందంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార.. షార్ట్ ఫిలిం గురించి మీరు చెబితే సందేహాలు వస్తే అడుగుతాను అంటుంది వసు. పని చెప్పే వారికి సందేహాలుంటే అది వాళ్ల ప్రాబ్లెం..కానీ నేను మాత్రం పని పూర్తిచేయడంపైనే ఉంటానని రిషిని ఉద్దేశించి చెప్పేసి వెళ్లిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.


మంగళవారం ఎపిసోడ్ లో
రెస్టారెంట్ కి వెళ్లి కాఫీ తాగిన గౌతమ్..సెల్ఫీ తీసుకుని స్టేటస్ లో పెడతాడు. అది చూసిన రిషి వెంటనే అక్కడకు వెళ్లిపోతాడు. ఇంటికే కదా వెళ్లేది నేను కూడా ఆటోలో వస్తా అని వసుని అడుగుతాడు గౌతమ్. ఇంతలో నేను కూడా వస్తానంటూ అక్కడకు ఎంట్రీ ఇస్తాడు రిషి. 


Also Read: ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
Also Read: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి