గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్


డిసెంబరు 20 సోమవారం గుప్పెడంత మనసు ఏపిసోడ్  కాలేజీలో గౌతమ్-జగతి-మహేంద్ర-వసు మాట్లాడుకోవడంతో ప్రారంభమైంది.
గౌతమ్: నువ్వు మా రిషికి ప్రాజెక్ట్ లో రైట్ హ్యాండ్ అంటగా, సోషల్ సర్వీస్, ఇలాంటి వాటిల్లో ముందుంటావంట వాడు నాకు అస్సలు చెప్పనేలేదు. అయినా అంట ఏంటి కళ్లారా చూశాను కదా, ముక్కు మొహం తెలియని పర్సన్ ని హాస్పటల్లో అడ్మిట్ చేశారు.మీరు చిన్నప్పటి నుంచీ ఇంతేనా అంటాడు వసుని ఉద్దేశించి
మహేంద్ర: గౌతమ్.. వసుధార ఎవరో తెలుసా జగతి మేడం శిష్యురాలు 
గౌతమ్: గ్రేట్ మేడమ్ మీరు మంచి ప్రాజెక్ట్ డిజైన్ చేశారు, మంచి శిష్యురాలిని తయారు చేశారు
జగతి: ఇందులో నా గొప్పతనం ఏమీలేదు, వసుధార తెలివైన విద్యార్థి
గౌతమ్: ఇంతకీ వసుధారకి-నాకు పరిచయం ఎలా జరిగిందో తెలుసా మేడం, ఆసుపత్రిలో ఓపర్సన్ ని చేర్పించడానికి లిఫ్ట్ అడిగింది. అప్పుడే నేను అటు వెళుతూ లిఫ్ట్ ఇచ్చాను, అంతటితో ఆగిపోతే కథలో ట్విస్ట్ ఏముంది మేడం, నా కార్డులు కొన్ని తన బ్యాగులో ఉండిపోయాయి. ఆ కార్డులో నంబర్ చూసి తను నాకు కాల్ చేశారు. నాకు మార్నింగ్ కాల్ అలా వచ్చింది అంకుల్ అంటాడు మహేంద్రని చూస్తూ.
వసుధార: సార్ మీ కార్డ్స్ తీసుకోండి అంటే తీసుకుంటా వసుధారా నేనెక్కడకి పోతా అంటాడు గౌతమ్
గౌతమ్: అటుగా వచ్చిన రిషిని చూసి రేయ్ రిషి ఇలా రా అంటే నాకు మీటింగ్ ఉంది వెళ్లిపోతా అన్న రిషితో వెళుదువులే రా అనడంతో రిషికి తప్పదు. ఇ ప్పుడే మీ జగతి మేడంని కలిశాను, మిషన్ ఎడ్యుకేషన్ ఐడియా మేడందే అంటగా అంతగొప్ప ఐడియా ఇచ్చినందుకు మేడంకి నువ్వు రోజూ థ్యాంక్స్ చెప్పినా తప్పులేదు. ఆ ప్రాజెక్ట్, ఇటు జగతి, అటు వసుధార అబ్బో....
రిషి: గౌతమ్ పై సీరియస్ అయి మహేంద్ర వైపు తిరిగి  డాడ్ మనకి మీటింగ్ ఉందికదా పదండి
జగతి: వసుధార మీటింగ్ కి వెళదాం అంటే కాసేపు బయట కూర్చుని వస్తాఅన్న వసుధారతో నేను కంపెనీ ఇస్తా అంటాడు గౌతమ్. స్పందించిన రిషి నువ్వు ఎక్కడికీ తిరగొద్దు...నా క్యాబిన్లో కూర్చో అంటాడు రిషి.


Also Read: సారీ చెప్పమంటున్న రిషి.. చెప్పేదే లే అంటున్న వసుధార... మిషన్ ఎడ్యుకేషన్ ఫొటోస్ లో రిషి-నువ్వే ఉన్నారు జగతి మేడం కనిపించలేదన్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్
వసుధార-పుష్ప: కాలేజీలో ఎవరో కొత్తపర్సన్ కనిపించారన్న పుష్పతో ఆయన రిషి సర్ ఫ్రెండ్, నిన్న రాత్రి ఓ యాక్సిడెంట్ జరిగితే లిఫ్ట్ ఇచ్చారంటుంది. గౌతమ్ గారు పదేళ్లక్రితమే పరిచయమే ఉన్నట్టు గలగలా మాట్లాడుతున్నారు, మన రిషి సర్ ఉన్నారు సరిగా మాట్లాడనే లేదు. గౌతమ్ సర్ సరదాగా మాట్లాడతారు..రిషి సర్ మాత్రం నోట్లో ముత్యాలు రాలుతాయేమో అన్నట్టుంటారు అంటుంది. స్పందించిన పుష్ప నువ్వు కూడా అంతే కదా వసు మాటల్లో దూసుకెళతావ్ అంటే...మాటలు మనకు దేవుడిచ్చిన వరం మాట్లాడితే తప్పేముంది అంటుంది. రిషి సర్ ఎప్పుడూ కోపంగా ఉంటారు..గౌతమ్ సర్ గలగలా మాట్లాడతారు, మనసులో ఏదుంటే అదిచెప్పేస్తారు అలా ఉండాలంటుంది. నువ్వు నోట్ బుక్ అడిగావ్ కదా ఇదిగో అని బుక్ ఓపెన్ చేయగానే అందులో నెమలి ఈక ఎగిరి వెనకనే నించున్న రిషిపై పడుతుంది. మన మాటలు రిషి సర్ వినే ఉంటారా అంటే..అన్నీ నువ్వే మాట్లాడావ్ అక్షింతలు నీకే అని పుష్ప వెళ్లిపోతుంది. ఈగో మాస్టర్ వసుధార దగ్గరకు వస్తాడు.


Also Read: వసుధార కౌంటర్లకి విలవిల్లాడుతున్న ఇగోమాస్టర్ రిషి.. వసుని చూసి మురిసిపోతున్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 16 గురువారం ఎపిసోడ్
రిషి-వసుధార: ఏంటి బాగానే మాట్లాడుతున్నావ్  అంటే ఏం లేదు సర్ మనుషులు, మాట్లాడే విధానం ఎలా ఉండాలని పుష్పకి చెబుతున్నా అన్న మాట విని మధ్యలో నాపేరు వినిపించింది అంటాడు రిషి. మాటలు ఎలా పొదుపుగా మాట్లాడాలో మీ పేరు , గలగలా మాట్లాడటం గురించి చెబుతూ గౌతమ్ సర్ గురించి చెప్పానంటుంది. నమ్మొచ్చా మొత్తం నిజమే చెప్పావా అన్న రిషితో ఉన్నది ఉన్నట్టు చెప్పలేం కానీ నేను చెప్పినదాంట్లో ఇవన్నీ ఉన్నాయంటుంది. చేతిలో నెమలి ఈక వసుధారకి ఇస్తాడు. థ్యాంక్స్ చెప్పిన వసుతో నీ థ్యాంక్స్ అవసరం లేదు సారీ చెప్పు..నాక్కాదు మా పెద్దమ్మకి అంటాడు. ధరణి వదిన నీకు ఈ పాటికి చెప్పే ఉంటుంది అనుకుంటాను ( ఫోన్ లైన్లో వసు ఉందని చెప్పి రిషి మాట్లాడిన మాటలు బ్యాంగ్రౌండ్ లో వస్తాయి) ..నువ్వు, మీ జగతి మేడం మా పెద్దమ్మకి సారీ చెప్పాలి అన్న రిషితో ...నేను తప్పు చేయనప్పుడు చెప్పేది లే అంటుంది వసుధార. పెద్దమ్మ బాధపడ్డారు అందుకే నేను బాధపడ్డాను మీరు సారీ చెబితే ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తా అన్న రిషితో అసలు సారీ చెప్పను అని సూటిగా చెప్పేస్తుంది.  మీకు తెలిసిందే నమ్ముతారు, దేవయాని మేడం చెప్పిందే నమ్ముతారు..అసలేం జరిగిందో మీరు తెలుసుకోరని మండిపడుతుంది. చెప్పింది నమ్మడం కాదు నేను కళ్లారా చూశానంటాడు రిషి. అక్కడేమీ జరగలేదు , ఏదో జరిగినట్టు మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు ..జగతిమేడం, నేను సారీ చెప్పడం లేదు. సారీ చెప్పడం అంటే సంస్కారానికి నిదర్శనం, చేయని తప్పుకి సారీ చెప్పడం అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే అన్న వసుధార ఎదురుగా ఎవరున్నా నేను భయపడను అని చెప్పేసి వెళ్లిపోతుంది. నీపేరు నేను ఊరికే పెట్టలేదు పొగరు అని అనుకోగానే వసు వెనక్కి తిరుగుతుంది... వినిపించిందా తనకు అనుకునేలోగా మీ షర్ట్ కి నెమలీక దారాలు ఉన్నాయి చూసుకోండని చెప్పేసి వెళ్లిపోతుంది. సారీ చెప్పనని నామొంహమీదే చెప్పేసి వెళుతోంది..ఎందుకింత అహంకారం అనుకుంటాడు


Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
మీటింగ్ రూమ్
జగతి మేడం చెప్పిన పాయింట్స్ బావున్నాయి అంతా ఫాలోఅవండని ఫణీంద్ర చెబుతాడు. ఇంతలో రిషి రావడంతో .. నెక్ట్ లెవెల్ మిషన్ ఎడ్యుకేషన్లో వాలంటీర్స్ ని ఎలా ట్రైన్ చేయాలో పాయింట్స్ రాశాను, కాలేజీలో స్టూడెంట్స్ ని మరింత షార్ప్ గా తయారు చేయడానికి కొన్నిటిప్స్ రాశాను సర్..మీరు వింటానంటే చెబుతా అంటుంది జగతి. కానీ రిషి మాత్రం విండో బయట గౌతమ్-వసుధార మాట్లాడుకోవడాన్ని చూస్తూ ఉండిపోతాడు. రిషి ఎప్పటికీ సమాధానం చెప్పకపోవడంతో సర్ అని పిస్తుంది..రిషి మీరు చెప్పండి మేడం అంటాడు కానీ వసు-గౌతమ్ మాట్లాడుకోవడాన్నే చూసి ఉండిపోతాడు. ఏమైంది రిషి అని మీటింగ్ లో ఉన్నవారు అడగడంతో నాకు ఈ పాయింట్స్ క్లియర్ గా అర్థంకాలేదు.. పూర్తిగా రాసి మెయిల్ చేయండని చెప్పేసి వెళ్లిపోతాడు. స్పందించిన మహేంద్ర ఇంత చెప్పినా అర్థం కాలేదంటే ప్లాబ్లెమ్ నీలోనే ఉందని అనుకుంటూ మహేంద్ర రిషి రూమ్ లోకి వెళతాడు. 


Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
రిషి రూమ్ లో మహేంద్ర-రిషి: డాడ్ నామూడ్ బాలేదు అస్సలు బాలేదు కొటేషన్స్ చెప్పకండి ప్లీజ్ అన్న రిషితో నేను వచ్చిందే నీ మూడ్ ఎందుకు బాగాలేదో తెలుసుకునేందుకు అంటాడు మహేంద్ర. తెలుసుకుని ఏం చేస్తారంటే ప్రయత్నిస్తా అంటాడు మహేంద్ర. వసుధారతో పెద్దమ్మకి సారీ చెప్పించండి అన్న రిషి మాట విని షాక్ అవుతాడు మహేంద్ర. పెద్దమ్మని అవమానించినందుకు సారీ చెప్పించండి అంటాడు. పెద్దమ్మ దర్జాగా ఇల్లంతా తిరుగుతూ ఉండేవారు. ఇప్పుడు మంచంపై ఉన్నారు మీకేం బాధలేదా అయినా మీకెందుకు బాధేస్తుంది తమరు ఆపార్టీ కదా అంటాడు. పార్టీ ఏంటి రిషి జరిగింది తెలుసుకోవాలి కదా అన్న మహేంద్ర మాటలకు అడ్డుపడి..సారీ చెప్పించమన్నా మీతో అవుతుందా లేదా అన్నది చెప్పండంటాడు. అంత అహంకారం ఏంటి ఆ పొగరుకి అంటాడు. ఇంతలో ఫోన్లో రిషి పొగరు అని నంబర్ సేవ్ చేసుకున్న విషయం గుర్తుచేసుకుంటాడు మహేంద్ర. కొటేషన్స వద్దు డాడ్ పెద్దమ్మకి సారీ చెప్పిస్తారా లేదా అని రెట్టిస్తాడు రిషి. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.


Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్ లో 
రెస్టారెంట్లో రిషి, గౌతమ్ కూర్చుని ఉంటారు. రేయ్ వసుధార చిరునవ్వు భలే ఉంటుంది కదా అంటాడు గౌతమ్. నాకేమీ అలా అనిపించదు అన్న రిషితో కొన్ని నీకు అర్థంకావంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార ఆర్డర్ ప్లీజ్ అంటుంది..కాఫీ కావాలి దాంతో పాటూ మీ కంపెనీ కూడా అనగానే రిషి మరి నేనెందుకు అని లేచి వెళ్లిపోతాడు. రిషి సర్ ఉంటే బావుండును, నేను ఉండమని అనలేను అనుకుంటే..బయటకొచ్చి కారు దగ్గర నిల్చున్న రిషి...ఏంటీ ఈ వసుధార సర్ కూర్చోండి అనొచ్చు కదా ...వెళ్లనీ అనుకుందా అని హర్ట్ అవుతాడు....


Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: మోనితకి విశ్వరూపం చూపించిన సౌందర్య, రుద్రాణితో డాక్టర్ బాబు ఛాలెంజ్, అర్థరాత్రి పిల్లల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్ ను చూసి కంగారు పడిన దీప, కార్తీకదీపం డిసెంబరు 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read:  ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read:  దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి