2021 డిసెంబరు 20 సోమవారం రాశిఫలాలు 


మేషం
ఈరోజు సాధారణంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి.  దగ్గర్లో ఉండే ఓ ప్రదేశాన్ని  సందర్శించేందుకు ప్లాన్ చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. మీ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు స్వల్ప మార్పులుండొచ్చు. 
వృషభం
రోజు ప్రారంభంలో కొంత గందరగోళంగా ఉన్నా కాస్త సమయం తర్వాత పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు మతపరమైన కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు. మీ పని క్రెడిట్ ను తీసుకునేందుకు  కార్యాలయంలో కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. తెలియని వ్యక్తులకు రుణాలు ఇవ్వొద్దు. రిస్క్ తీసుకోవద్దు. 
మిథునం
సమాజంలో గౌరవాన్ని పొందుతారు. వ్యాపారంలో సవాళ్లు ఎదురవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించడం కొనసాగించండి. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు సర్దుకునే సూచనలున్నాయి. మీ మాటతీరుతో ఆకట్టుకుంటారు. టెన్షన్ తగ్గుతుంది. 
Also Read:  2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
కర్కాటకం
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువులో ఇబ్బందులు  ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కొన్ని పనులపై బయటకు వెళ్లవలసి రావచ్చు. మీ అభిప్రాయాలను  చాలా మంది విభేదిస్తారు.  అనియంత్రిత ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అవసరమైన ఖర్చులు పెరగొచ్చు. 
సింహం
మీరు మీ నైపుణ్యంతో ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో నగదు సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. మీ పిల్లలు తమ కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు కుటుంబ సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పాత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. 
కన్య
మీరు మీ ఉద్యోగం విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. ఆఫీసులో సీనియర్ల సహకారం తీసుకోవడానికి వెనుకాడరు. మీ బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో ముందస్తు చెల్లింపు పొందడం వల్ల పని వేగవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితుడిని కలుస్తారు. మీరు మంచి సమాచారాన్ని పొందొచ్చు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
తుల
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని భిన్నమైన ఆలోచనల్లో మునిగిపోతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. స్నేహితుడిని కలుసుకున్న తర్వాత మనసు ఆనందంగా ఉంటుంది.  సందేహాస్పద ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. మీ సామర్థ్యం, కృషిని నమ్మండి. బాధలు దూరమవుతాయి.
వృశ్చికం
ఈరోజు ఎవరితోనైనా వాగ్వాదం జరగొచ్చు. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. కొన్ని సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. మీ పనిపై దృష్టి పెట్టండి. కొన్ని కారణాల వల్ల కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థికంగా బావుంటుంది. 
ధనుస్సు
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి లాభం ఉంటుంది.  మీరు కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటే ఇదే అనుకూల సమయం. సమీప ప్రదేశానికి ప్రయాణం ఫలవంతంగా ఉంటుంది. మార్కెటింగ్, మీడియా సంబంధిత పనులకు ఈ రోజు చాలా మంచిది.  వివాదాల్లో తలదూర్చవద్దు. 
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
మకరం
వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో సమస్యల వల్ల ఒత్తిడికి లోనవుతారు.ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలకు సంబంధించి భాగస్వాములతో విభేదాలు రావొచ్చు.  ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి కలిసొచ్చే సమయం. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది.
కుంభం
మీకు  ఈరోజు అద్భుతంగా ఉంటుంది. బంధువులు, పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది. ఉద్యోగాలు మారే ఉద్దేశం ఉంటే ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి.  డబ్బుతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. టెన్షన్ తగ్గుతుంది.
మీనం
ఈరోజు సాధారణంగా ఉంటుంది. బంధువులు రావొచ్చు.  కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.  పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. కీళ్ల నొప్పుల సమస్య వెంటాడుతుంది. కొత్తగా ఏపనులు చేపట్టవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. 
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: గుడ్ల గూబను అశుభం అనుకుంటే పొరపాటే.. ఈ విషయం తెలుసా..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి