ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి.
2022 రాశి ఫలితాలు
రెండేళ్లుగా కరోనా చెడుగుడు ఆడేస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త సర్దుమణుగుతోంది. గడిచిన బ్యాడ్ డేస్ ని వదిలేసి సరికొత్తగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారంతా. కొత్త ఆశలు, ఎన్నో కోర్కెలు, మరెన్నో అంచనాలతో 2022 కి వెల్ కమ్ చెప్పనున్నారు. మరి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2022 కొత్త ఏడాదిలో ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
ధనుస్సుధనస్సు రాశివారికి ఏడాది ఆరంభం అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదలకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చదువుపరంగా వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. గ్రహాల ప్రతికూల ప్రభావాల కారణంగా మీలో మానసిక ఆందోళనలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఏడాది చివర్లో మీరు పనిచేస్తున్న రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు.
మకరంమకర రాశివారికి ఈ ఏడాది అంత అనుకూల ఫలితాలు లేవు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. చిన్న సమస్య వచ్చినా అప్రమత్తం అవండి. ఆర్థిక సంబంధింత విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. మీ కుటుంబ సభ్యులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి. వారికి తగిన సమయం ఇవ్వండి. ఇంట్లో వచ్చే సమస్యలను ప్రశాంతంగా పరష్కరించుకునేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
కుంభంఈ రాశి వారికి 2022 భలే ఉంటుంది. పెళ్లికాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. వివాహితులు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కలిసొచ్చే ఏడాది ఇది. కెరీర్ పరంగా పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. సొంత వ్యాపారం ఉన్నవారు విజయం సాధిస్తారు. భాగస్వామితో కలిసి పని చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉంటే 2022 చివరి నాటికి నెరవేరే అవకాశం ఉంది.