భగవధ్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. ఉరకల పరుగుల జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే చదివిన వారికి ఎంతవరకూ అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాలను కొన్ని ప్రశ్నలు సమాధానాల రూపంలో ఇస్తున్నాం. 
Part 1, Part-2, Part-3 లో 60 ప్రశ్నలు-సమాధానాలు ఇచ్చాం... 61 నుంచి 80 వరకూ ప్రశ్నలు సమాధానాలు ఇక్కడ చూడొచ్చు.
61. స్వధర్మ, పరధర్మాల్లో ఏది శ్రేష్ఠమైనది?
స్వధర్మం
62. పొగచేత అగ్ని, మురికిచేత అద్దం, మావిచేత గర్భమందలి శిశువు కప్పి ఉన్నట్లు ఆత్మజ్ఞానం దేనిచే కప్పి ఉంటుంది?
కామము చేత 
63. ఏ ప్రేరణతో జీవుడు తాను వద్దనుకున్నా పాపం చేస్తాడు?
కామము ప్రేరణతో
64. భగవంతుడెపుడు అవతరిస్తాడు?
ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందినపుడు
65. అసురుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
 ప్రహ్లాదుడు
Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
66. గంధర్వుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
చిత్రరథుడు
67. హృదయ శుద్ధి ద్వారా మోక్షం దేనివలన కలుగుతుంది?
జ్ఞానతపస్సు
68. జ్ఞానప్రాప్తి వలన కలిగే  ఫలితమేంటి?
పరమశాంతి
69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి  మనస్సు దేనితో పోల్చవచ్చు?
గాలిలేనిచోట గల దీపంతో
70. ఏ సాధనములతో మనస్సు నిగ్రహింగా ఉంటుంది?
అభ్యాసం, వైరాగ్యం
71. భయంకరమైన మాయను దాటడం ఎలా ?
భగవంతుని శరణుపొందుట వలన
Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
72. భగవంతుని సేవించువారిని  శ్రీకృష్ణుడు  ఎన్నిరకాలుగా వర్గీకరించాడు?
నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని)
73. భగవత్స్వరూపమును ఎవరు తెలులుకోలేరు?
అజ్ఞానులు
74. విద్యల్లో శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?
బ్రహ్మవిద్య
75. మహర్షుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
 భృగు మహర్షి
Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3
76. బ్రహ్మవిద్యకు అర్హతేంటి?
హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము
77. ఆకాశంలో వాయువులా, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి ఉన్నది?
పరమాత్మలో
78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెలా అవుతాడు?
పరమాత్మపై  అనన్యభక్తితో
79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?
భగవంతుని భక్తుడు
80. సమస్త ప్రాణికోటి  హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?
సాక్షాత్తు పరమాత్మయే


మొత్తం 108 ప్రశ్నల్లో  మిగిలిన 28 Part-5 లో చూడొచ్చు.


Also Read: భగవద్గీత పూజించడానికి మాత్రమే కాదు.. మనిషిగా బతకడానికి
Also Read: వారణాసి మహిమను వివరించే కాశీవిశ్వనాథ్ కారిడార్.. అక్కడ అణువణువూ ప్రత్యేకమే
Also Read: శవాలు దహనం చేసే ఘాట్ సహా కాశీలో ముఖ్యమైన ఘాట్లు ఇవి..
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు… 
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి