ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ శ్రీ కాశీ విశ్వనాథ్ కారిడాన్ ను జాతికి అంకితం చేశారు. 
ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలివే..
1.1669 లో అహిల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత దాదాపు 350 ఏళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ విస్తరణ , పునరుద్ధరణ కోసం 2019 మార్చి 8 న విశ్వనాథ్ ఆలయ కారిడార్ కు శంకుస్థాపన చేశారు.  అది జరిగిన దాదాపు రెండేళ్ల 8 నెలలకు ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పనులు 95 శాతం పూర్తయ్యాయి.
2. మొత్తం కారిడార్ నిర్మాణానికి రూ .340 కోట్లు వ్యయం అయినట్టు అంచనా. మొత్తం వ్యయం గురించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. 
3. మొత్తం కారిడార్ ను దాదాపు 50 వేల చదరపు మీటర్ల ఒక పెద్ద ప్రాంగణంగా నిర్మించారు . దీని ప్రధాన ప్రవేశ మార్గం గంగానది వైపు లలితా ఘాట్ నుంచి ఉంటుంది . 
4. విశ్వనాథ్ కారిడార్ ను మొత్తం 3 భాగాలుగా విభజించారు . 
మొదటిది ఆలయ ప్రధాన భాగం దీనిని రెడ్ శాండ్ స్టోన్ తో నిర్మించారు. ఇందులో నాలుగు పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి .ఒక ప్రదక్షిణ మార్గం కూడా నిర్మించారు  ఆ ప్రదక్షిణ మార్గంలో 22 మార్బుల్స్ మీద కాశీ మహిమను వర్ణించే వివరాలు చెక్కారు . ఈ కారిడార్లో 24 భవనాలు నిర్మించారు . వీటిలో ప్రధాన ఆలయ ప్రాంగణం , ఆలయ చౌరస్తా , ముముక్షు భవన్ , యాత్రికుల వసతి కేంద్రం , షాపింగ్ కాంప్లెక్స్ , మల్టీపర్పస్ హాల్ , సిటీ మ్యూజియం , వారణాసి గ్యాలరీ , గంగా వ్యూ కెఫే రెస్టారెంట్ ఉన్నాయి . ఈ ధామ్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ప్రాంగణం చుట్టూ 5 వేలకు పైగా లైట్లు ఏర్పాటు చేశారు .
5.కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం కోసం దాదాపు 400 ఇళ్లు , వందలాది ఆలయాలు సేకరించారు . 
6. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో విశ్వనాథ్ ఆలయం ఉండడంతో దాదాపు 400 ఆస్తులు కొనుగోలు చేశారు . దాదాపు 14 వందల మందిని నగరంలో ఇతర ప్రాంతాలకు తరలించారు .
7. దాదాపు రెండేళ్ల 8 నెలలపాటు నిర్మాణం జరిగిన ఈ డ్రీమ్ ప్రాజెక్టులో ఇప్పటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి . 
8. ప్రస్తుతం ఈ కారిడార్లో 2600 మంది కార్మికులు , 300 మంది ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు .
9. ఈ కారిడార్ నిర్మాణం కోసం సేకరించిన 400 ఆస్తుల్లో 27 కాశీ ఖండోక్త్ ఆలయాలు , 127 ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి . వీటిని కూడా సంరక్షించనున్నారు . 
10. కాశీ ఖండోక్త్ ఆలయాన్ని గతంలో ఉన్నట్లు పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు . దీనిని కారిడార్లోని రెండో దశలో పూర్తి చేయనున్నారు