సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత. ఈ పవిత్రగ్రంధ్రం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవధ్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. ఉరకల పరుగుల జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే చదివిన వారికి ఎంతవరకూ అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాలను కొన్ని ప్రశ్నలు సమాధానాల రూపంలో ఇస్తున్నాం. 
Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
Part 1 లో 20 ప్రశ్నలు-సమాధానాలు ఇచ్చాం... 21 నుంచి 40 వరకూ ప్రశ్నలు సమాధానాలు ఇక్కడ చూడొచ్చు.
21. భగవద్గీతలో శ్రీకృష్ణునికి వాడిన ఏవైనా మూడు పేర్లు?
అచ్యుత, అనంత, జనార్ధన
22. భగవద్గీతలో అర్జునునికి వాడిన ఏవైనా మూడు పేర్లు?
ధనుంజయ, పార్ధ, కిరీటి
23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానాలు చేశాడు. ఒకటి మురళీగానం. మరి రెండోది?
గీతా గానం
24.“ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపంలో వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
ఎడ్విన్ ఆర్నాల్డ్
25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
పౌండ్రము
26. ఏకాదశ రుద్రుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
శంకరుడు
27.“నా తల్లి చాలా కాలం క్రితమే మరిణించింది. అప్పటినుంచీ భగవద్గీత ఆ స్థానం ఆక్రమించి పక్కనే ఉండి నన్ను కాపాడిందని చెప్పిన  స్వాతంత్ర్య  సమరయోధుడెవరు?
మహాత్మాగాంధీ.
Also Read: భగవద్గీత పూజించడానికి మాత్రమే కాదు.. మనిషిగా బతకడానికి
28. భగవద్గీత ఏ వేదంలోది?
పంచమ వేదం-మహాభారతం
29. భగవద్గీతలో ఎన్నో అధ్యాయంలో  విశ్వరూప సందర్శన ప్రత్యక్షంగా వర్ణించి ఉంటుంది?
11వ అధ్యాయము
30. ద్వాదశాదిత్యుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
విష్ణువు
31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేంటి?
అర్జున విషాద యోగం
32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
పదివేలమంది
33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
అనంతవిజయం
Also Read: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని- ప్రపంచ సాంస్కృతిక నగరం… వారణాసి గొప్పతనం ఇదే..
34. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
 “ధర్మ” – శబ్దముతో గీత ప్రారంభమయినది.
35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
సంజయుడు
36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
దృష్టద్యుమ్నుడు.
37. ఆయుధాలలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పాడు?
 వజ్రాయుధం
38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహం పేరేమిటి?
వజ్ర వ్యూహం
39. గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
భీష్ముడు
40. సర్పాల్లో  తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పాడు?
వాసుకి.
Also Read: వారణాసి మహిమను వివరించే కాశీవిశ్వనాథ్ కారిడార్.. అక్కడ అణువణువూ ప్రత్యేకమే
Also Read: శవాలు దహనం చేసే ఘాట్ సహా కాశీలో ముఖ్యమైన ఘాట్లు ఇవి..
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు… 
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండిAlso Read: