వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున 'వారణాసి' అనే పేరువచ్చింటారు. వారణాసి పేరును పాళీభాషలో బారణాసిగా రాసేవారు. అది తర్వాత బనారాస్ గా మారింది. వారణాసి నగరాన్ని పురాణ ఇతిహాసాల్లో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే ఎన్నో పేర్లతో ప్రస్తావించారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి.
కాశీ ప్రత్యేకతలు



  • భూమిపై ఉన్న సప్త మోక్షదాయక క్షేత్రాల్లో కాశి ఒకటి, పన్నెండు జోతిర్లింగాల్లో శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాల్లో విశేషమైన స్థలం.

  • కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడిన భూభాగం. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోది కాదు. విష్ణు మూర్తి హృదయం నుంచి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న  ఆధ్యాత్మిక రాజధాని. స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం.

  • ప్రళయ కాలంలో కూడా నీట మునగని ప్రాచీన పట్టణం. ఎందుకంటే ప్రళకాలంలో కూడా శివడు తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడాడని చెబుతారు.

  • కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనం ముఖ్యం అంటారు

  • ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప  క్షేత్ర పాలకుడు భైరవుడు జీవిని కాశీ లోకి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదంటారు

  • కాశీలో ప్రవేశించిన జీవికి సంబంధించిన పాపపుణ్యాలు చిత్రగుప్తుడి చిట్టానుంచి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుందట. అందుకే కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి నల్లని దారం కడతారని చెబుతారు.

  • కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలామంది జీవిత చరమాంకాన్ని కాశీలో గడపాలని అనుకుంటారు.

  • ఎవరి అస్తికలు అయితే గంగలో కలుపుతామో వారు మళ్లీ కాశీలో జన్మించి విశ్వనాథుడి కరుణాకటాక్షాలకు పాత్రులవుతారట

  • ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదంటే విశ్వనాథుడి మహిమే అంటారు.


Also Read: పూజ కోసం ఈ పూలు చెట్టునుంచి కోయకూడదు, ఎవ్వరి దగ్గరా తీసుకోకూడదు..ఎందుకో తెలుసా..
ఎన్నో వింతలకు నిలయం వారణాసి



  • కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

  • కాశీలో మందిరం చుట్టూ ఎన్నో సందులుంటాయి. ఎన్నో వలయాల్లా కొత్తగా వచ్చిన వారికి పద్మవ్యూహంలా అనిపిస్తాయి

  • పూర్వం ఈ మందరి చుట్టూ ఎన్నో సుందర వనాలు ఉండేవట. విదేశీయుల దండ యత్రనుంచి కాపాడుకునేందుకు ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారిలేకుండా చేశారని చెబుతారు.

  • కాశీ విశ్వేశ్వరుడికి  భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుంచి ముక్తి లభిస్తుంది.

  • కాశీ క్షేత్రంలో పుణ్యం చేసినా, పాపం చేసినా ఆ ఫలితం కోటిరెట్లు అధికంగా ఉంటుందంటారు


Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…
Also Read: కాళ్లకు మెట్టెలు పెట్టుకునేది పెళ్లైందో లేదో తెలుసుకునేందుకు కాదు..
Also Read: ఈ సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్ లో ఉంటే దృష్టి దోషాలు తగలవు, దుష్ట శక్తులు పారిపోతాయట...
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి