స్త్రీకి వివాహంతో వచ్చే అలంకారాలలో ఒకటి మెట్టెలు లేక మట్టెలు. ఒక స్త్రీకి పెళ్లి అయిందా- లేదా అని అడగకుండా తెలుసుకోవటానికి పాదాల వంక చూస్తారు మెట్టెలు ఉన్నాయా? లేవా? అని.  ఇప్పుడు ఆ రోజులు పోయాయ్..పెళ్లైన అమ్మాయిలు మెళ్లో మంగళసూత్రం, కాలికి మెట్టెలు పెట్టుకునే వారి సంఖ్య చాలా చాలా తక్కువ. సంప్రదాయ  పెళ్లిలో  ''స్థాలీపాకం'' పేరుతో ఓ పద్ధతి ఫాలో అవుతారు. ఆ సమయంలో పెళ్లికూతురి కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతారు. ఈ ఆచారం వెనుక కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. 
Also Read: ఈ సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్ లో ఉంటే దృష్టి దోషాలు తగలవు, దుష్ట శక్తులు పారిపోతాయట...
మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలంటే...



  • పాదం మొత్తం నేలపై మోస్తుంది కానీ వేళ్లు మాత్రం మధ్య భాగంలో కాస్త గ్యాప్ వస్తుంది.  ఆ భాగంలోనే నాడీ కేంద్రాలుంటాయి. వాటిని సుకుమారంగా ఒత్తినట్టైతే నాడులు చురుకుగా పని చేస్తాయి.

  • కాలి బొటన వేలికి ప్రక్క వేలు క్రింది భాగంలో ఉన్న నాడీ కేంద్రం గర్భాశయానికి సంబంధించింది. వివాహితులు మట్టెలను ధరించడం వల్ల రుతుస్రావం సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది.

  • ఆయుర్వేదం ప్రకారం బొటన వేలు పక్క ఉండే వేలుతో గర్భాశయానికి సంబంధం ఉంటుంది. మెట్టెలను ఈ వేలుకు ధరించడం వల్ల గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి, జననేంద్రియాల సమస్యల నుంచి బయటపడతారు.


Also Read: ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యాన్నిచ్చే వ్రతం ఇది..



  • మట్టెలు ఆక్యుప్రెజెర్ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే నరాలపై ఇవి ఒత్తిడి తీసుకువస్తాయి. దీని వల్ల మహిళల్లో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుంది.

  • సాధారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలకు ఉన్న చాలా గైనిక్ సమస్యలు పెళ్లయ్యాక తగ్గుతూవస్తాయి. అందుకు కారణాలెన్నో..వాటిలో కాలివేలికి పెట్టే మెట్టెలు కూడా ఓ కారణం.

  • సంతానలేమి సమస్య ఉన్న పురుషులకు కాలి వేలికి రాగితీగను గట్టిగా చుడతారు. ఇలా ఒత్తిడి కలిగించడంవల్ల ఆ సమస్య నివారణ అవుతుందని చెబుతారు. 


Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..



  • పురుషుల కంటే స్త్రీలలో కామవాంఛ ఎక్కువట. అప్పట్లోనే ఈ వాస్తవాన్ని కనిపెట్టిన మహర్షులు స్త్రీలు మెట్టెలు ధరించినట్లయితే వారి కోరికలు నియంత్రణలో ఉంటాయని చెప్పారని కొన్ని పురాతన గ్రంధాలు చెబుతున్నాయి. 

  • వీటిని వెండితో తయారు చేస్తారు. వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం. ఇవి భూమిలోని శక్తిని శోషణం చేసుకుని శరీరానికి అందిస్తాయి. దీంతో శరీర వ్యవస్థ పునరుత్తేజితం అవుతుంది. అంతేకాదు శరీరంలోని ప్రతికూలతలను బయటకు పంపుతుంది.


మన ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఆరోగ్య రహస్యాలెన్నో ఉన్నాయి కానీ నాటి తరం వారికి దేవుడు, సెంటిమెంట్ తో ముడిపెడితే అనుసరిస్తారని పెళ్లైన వాళ్లు మెట్టెలు పెట్టుకోవాలని చెప్పేవారు. ఇప్పటికైనా మెట్టెలు అలంకారం కోసమే అనే ఆలోచన మార్చుకోవాలంటున్నారు పండితులు.
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి