కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత గోనె ప్రకాష్ రావు మంచి వాగ్ధాటి గల నేత. అయితే ఆయన రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు. కానీ హఠాత్తుగా ఓ మహిళా కలెక్టర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపుతున్నారు. "  ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన బయోడేటా గురించి ఆరా తీశారని, ఓ జర్నలిస్ట్‌ను అడిగి తన గురించి తెలుసుకున్నారని చెబుతూ.. ఆమె చీర తడపకపోతే తన పేరు గోనె ప్రకాష్ రావే" కాదంటూ సవాల్ విసిరారు. " కేసీఆర్ భాషలో లాగు తడవాలని అంటారు కదా.. నేను ఆమె చీర తడుపుతా" అంటూ గోనె ప్రకాశ్ రావు తమ మాటలకు విశ్లేషణ కూడా చేశారు.  


Also Read : నో టచ్ అండ్ నో స్మెల్‌.. ప్రాథమిక దశలోనే అగిపోయిన న్యూజిలాండ్ తరహా పార్క్‌


గోనె ప్రకాష్ రావు ఆగ్రహానికి కారణం అయిన బయోటడేటాను కలెక్టర్ ఎందుకు తీసుకున్నారో.. తీసుకున్నారో లేదో స్పష్టత లేదు. గోనే ప్రకాష్ రావుకు ఎలా తెలిసిందో కూడా తెలియదు. కానీ ఆయన మాత్రం మహిళా కలెక్టర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన బయోడేటా గురించే మాత్రమే కాకండా మహిళా కలెక్టర్ నిజాయితీపైనా అనుమానం వ్యక్తం చేస్తూ గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యలు చేశారు. 


Also Read : ఇక కేంద్రంతో కొట్లాటే... చేనేత కార్మికులపై కేంద్ర సర్కార్ సవితి ప్రేమ... సిరిసిల్లలో మంత్రి కేటీఆర్


 22 మంది టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కలెక్టర్ ఛాంబర్‌లో సమావేశమయ్యారని .. వారికి అక్కడేం పని అని ప్రశ్నించారు.  10 మంది ఎమ్మెల్యేలు, నలుగురు జెడ్పీ చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ కలెక్టర్ ఛాంబర్‌లో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఛాంబర్ సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు కానీ కలెక్టర్‌పై అదీ కూడా మహిళా కలెక్టర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనాత్మకం అయింది. 


Also Read: వచ్చే దసరాకు పాలనలో కొత్త వెలుగులు... రెడీ అవుతున్న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !


ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయడం సాధారణమని, కానీ ఒక కలెక్టర్‌పై.. అది కూడా మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని పలువురు నేతలు గోనె ప్రకాశ్‌ను తప్పుబడుతున్నారు.  గోనె ప్రకాష్ రావు తన మాటలను సమర్థించుకుంటున్నారు. రాజకీయాల్లో చురుకుగా లేని గోనె ప్రకాష్ రావు గురించి కలెక్టర్ ఎందుకు ఆరా తీస్తారని ఆయన సంచలనం కోసం ఇలాంటి మాటలు కలెక్టర్‌పై మాట్లాడరని కొంత మంది విమర్శిస్తున్నారు. 


Also Read: తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి