తెలంగాణ వచ్చే దసరాకి మరింత వెలుగులీనుంది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణాన్ని అప్పటికల్లా పూర్తి కానుంది. చకచకా సాగుతున్న నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రెండు, మూడు నెలలకో సారి క్షేత్ర స్థాయికి వెళ్లి పనులు పరిశీలించి నిర్మాణంలో నాణ్యతపై సలహాలు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే దసరా కల్లా పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.


Also Read : నూతన సచివాలయ పనులను పరిశీలించిన కేసీఆర్.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం


తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త సెక్రటేరియట్ !


తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మించాలని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేసీఆర్ పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. దానికో కారణం ఉంది. అప్పటి వరకూ ఉన్న సెక్రటేరియట్‌లు సమైక్య పాలనకు గుర్తుగానే కనిపిస్తూ ఉంటాయి. వాటికి బదులుగా తెలంగాణ గుర్తుకు వచ్చేలా ప్రత్యేకమైన సెక్రటేరిట్‌లో పాలన సాగాలని కేసీఆర్ భావించారు.  దాని కోసం చాలా ప్రయత్నాలు చేశారు. మొదట ఎర్రగడ్డలో అనుకున్నారు. అక్కడ ఉన్న ఆస్పత్రిని వికారాబాద్ తరలించాలని నిర్ణయించారు. కానీ తర్వాత వాస్తు ప్రకారం అదీ బాగోలేదని తేలడంతో నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్‌లో కట్టాలనుకున్నారు. అది రక్షణ శాఖది కావడంతో కేంద్రం నుంచి తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎప్పటికప్పుడు ఇస్తామని చెబుతూ వచ్చిన కేంద్రం చివరికి ఇవ్వలేదు. హుసేన్ సాగర్ ఒడ్డున ఉన్న సెక్రటేరియట్ స్థలంలోనే కొత్తది కట్టొచ్చు. కానీ అక్కడ ఏపీకి కేటాయించిన భవనాలున్నాయి. దాంతో తెలంగాణ భవనాలు మాత్రమే కూల్చి కొత్తది కట్టడం సాధ్యం కాదు. అందుకే స్థల సమస్యతోనే మొదటి విడతలో కేసీఆర్ ప్రయత్నాలు సఫలం కాలేదు. అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతికి మారినప్పటికీ తమకు ఉన్న భవనాలను ఇవ్వడానికి నిరాకరించింది. కానీ ఏపీలో గవర్నమెంట్ మారడం కేసీఆర్‌కు కలసి వచ్చింది. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయక ముందే భవనాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణాన్ని చురుగ్గా చేపట్టారు.


Also Read: Niranjan Reddy Open Letter: తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే?
 
ఆలస్యం చేసిన కోర్టు కేసులు.. కోరనా ! 


ఏపీ ప్రభుత్వం భవనాలు అప్పగించిన తర్వాత వేగంగా సచివాలయ నిర్మాణం పూర్తి చేయాలనుకున్నారు. కానీ కోర్టు కేసులు..కరోనా వంటివి అడ్డం రావడంతో ఎప్పటికప్పుడు ఆలస్యంఅయింది. చివరికి గత ఏడాది జూలైలో పాత భవనాల కూల్చివేత పనులు ప్రారంభించారు. ఆ పని పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించారు. నిర్మాణ రంగంలో ప్రసిద్ధి చెందిన షాపూర్జీ పల్లోంజీ సంస్థ పనులు చేపడుతోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కార్మికుల్లో చాలా మందికి వైరస్ సోకడం, స్వస్థలాలకు వెళ్ళిపోవడంతో పనులు దాదాపుగా ఆగిపోయాయి. తర్వాత పనులు పుంజుకున్నాయి. ప్రస్తుతం శ్లాబ్స్, గోడల పని చివరి దశకు వచ్చింది. షాపూర్జీ పల్లోంజీ సంస్థ మొత్తం శ్లాబ్ వర్క్, గోడల నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత ఇంటీరియర్ డెకొరేషన్‌తో పాటు విద్యుత్, ప్లంబింగ్, కార్పెంటరీ తదితర పనులు పూర్తిచేయాలి. ఆలస్యమవుతుందన్న కారణంతో ఇప్పటికే మంత్రుల చాంబర్లలో ఫాల్స్ సీలింగ్ పనులు ప్రారంభించేశారు.


Also Read: Revanth Reddy: పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం.. టీఆర్ఎస్, బీజేపీది కుమ్మక్కు రాజకీయం


కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ సచివాలయం !
 
తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణంపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. కొత్త భవనంలో అన్ని సౌకర్యాలు ఉండాలని పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా భవనం ఉండాలని ఎప్పటికప్పుడు సూచలు చేస్తున్నారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు  సకల సౌకర్యాలతో ఉండాలని ప్రతి అంతస్తులో డైనింగ్‌ హాలు, మీటింగ్‌ హాలు, వెయిటింగ్‌ హాల్ ఉండాలని డిజైన్ చేయించారు. తెలంగాణకు ప్రతిబింబంగా సచివాలయం నిలవాలనే ఆకాంక్షతో కేసీఆర్ ఉన్నారు. అందుకే... సచివాలయాన్ని ఓ భవనంగా మాత్రమే చూడకుండా అదో గుర్తుగా భావిస్తున్నారు. అందుకే.. స్వయంగా డిజైన్ల దగ్గర్నుంచి ప్రతీ అంశాన్ని పరిశీలిస్తున్నారు. తరచూ పరిశీలనకు వెళ్తున్నారు.


Also Read : ఈ పిల్లలు జీవితాంతం బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.. ఎండీ సజ్జనార్ గ్రేట్ ఆఫర్, ఎందుకంటే..


సిమెంట్ వర్క్ పరంగా ఓ రూపం !


తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న  సచివాలయానికి ఓ రూపం వస్తోంది. రాత్రింబవళ్లు పనులు సాగుతున్నాయి. ఓ వైపు పైన కాంక్రీట్ పనులు జరుగుతూండగా.. కింద ఇంటీరియర్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు.రెండు అంతస్తుల్లో మంత్రుల చాంబర్లు ఉంటాయి. వాటిలో ఫాల్స్‌ సీలింగ్‌ పనులు సైతం చేసేస్తున్నారు. సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణంపై ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాంటి మెటీరియల్ వాడాలో కూడా కాంట్రాక్టర్లకు సూచిస్తున్నారు. ఎర్రకోట నిర్మాణానికి ఉపయోగించిన ఆగ్రా ఎర్రరాతిని గోడలకు వాడాలని ఆదేశించారు. అలాగే లోప ల గోడలకు.. పెయింటింగ్.. కిటీకీలు ఎలాంటివి వాడాలి అన్న వాటిని ఖరారు చేశారు. అనుకున్నట్లుగా సాగితే వచ్చే దసరా తెలంగాణ స్వయం పాలన అచ్చమైన తెలంగాణ భవన్‌లో జరిగే అవకాశం ఉంది. 


Also Read: Singareni : సింగరేణిలో మూడు రోజుల పాటు ఉత్పత్తి బంద్ .. సంపూర్ణంగా కార్మికుల సమ్మె !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి