తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ పార్థివ దేహాన్ని డీఎన్ఏ పరీక్షల ద్వారా ఆర్మీ అధికారులు గుర్తించారు. సాయి తేజ పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా కోయంబత్తూరు తీసుకొచ్చారు. అక్కడి నుంచి బెంగళూరులోని బేస్ క్యాంప్ తరలించారు. రేపు ఉదయం ఐదు గంటలకు ఆర్మీ అధికారులు సాయి తేజ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం ఎగువరేగడకు తీసుకురానున్నారు. కర్ణాటక- ఆంధ్ర సరిహద్దు నుంచి భారీ ర్యాలీతో పార్థివ దేహాన్ని సాయి తేజ నివాసానికి తీసుకొస్తారు. తరువాత ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య సాయితేజకి ఆర్మీ అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలకనున్నారు.
కూనూరు చాపర్ క్రాష్ ఘటనలో అమరులైన మరో నలుగురు ఐఏఎఫ్ సిబ్బంది మృతదేహాలను డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించారు. జేడబ్ల్యూఓ ప్రదీప్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, జేడబ్ల్యూఓ ప్రతాప్ దాస్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు శనివారం ఉదయం ప్రకటించారు. కుటుంబసభ్యులను మృతదేహాలను నేడు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
విమానాలలో జవాన్ల భౌతికకాయాలను స్వగ్రామాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదివరకే సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, మరో సీనియర్ స్టాఫ్ లిడ్డర్ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. మృతదేహాలను గుర్తించడం వీలుకాకపోవడంతో అంత్యక్రియల ప్రక్రియలో జాప్యం తలెత్తుతోంది. మరికొందరు జవాన్ల భౌతికకాయాలను గుర్తించేందుకు వైద్యులు, నిపుణులు డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు.
Also Read: Gen Bipin Rawat Last Rites: వీడ్కోలు వీరుడా.. ముగిసిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు
Also Read: Husband Kills Wife: హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లయిన 6 నెలలకే వివాహిత దారుణహత్య.. పరారీలో భర్త!