చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. 2016-17 తరువాత రాష్ట్రంలో వేలాది మంది నేత కార్మికులకు ఉపాధి లభించిందన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని రూ.400 కోట్లతో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో దాదాపుగా రూ.1,334 కోట్ల రూపాయల ఆర్డర్లను ఇచ్చామన్నారు. సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందించడంలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 12 వందల ఎకరాల్లో వరంగల్ లో ఏర్పాటు చేయబోతున్న మెగా టెక్స్ టైల్ పార్క్ కు నిధులు మంజూరు చేయమని అడిగినా కేంద్రం స్పందించలేదన్నారు. చేనేత కార్మికులపై సవితి ప్రేమ చూపితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.



Also Read:  పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి


కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదు 


తెలంగాణ చేనేత కార్మికుల తరఫున పార్లమెంట్ లో నిలదీస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. భారతదేశంలో నూలు, రసాయనాలపై 50% సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ కేటాయించాలని కోరారు. అటు పార్లమెంట్ లో, ఇటు ప్రజాక్షేత్రంలో కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. పీఎం మిత్ర కింద రాష్ట్రానికి వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈ ప్రాంతంలో ఉండే బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమతో కలిసి రావాలన్నారు. 


Also Read: తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే?


కేంద్ర సర్కార్ నిర్లక్ష్య ధోరణి


నేతన్నల బతుకులు మారడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత నిస్తుందని, కానీ కేంద్ర సర్కార్ చిన్న భరోసా కూడా ఇవ్వడంలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చేనేత, జౌళి శాఖ అభివృద్ధికి కేంద్ర సర్కార్ నిర్లక్ష్య ధోరణి మానుకోవాలన్నారు. నేతన్నల బతుకులు మారడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. చేనేత అభివృద్ధికి తోడ్పాడలని ఏడున్నర ఏళ్లుగా ఎన్నో సార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదన్నారు. మెగా పవర్ లుమ్ క్లస్టర్ మంజూరు చేయమంటే ఇప్పటికీ ఉలుకు పలుకు లేదన్నారు. మరమగ్గాలను ఆధునీకరణ కోసం సాయం చేయమంటే పట్టించుకోలేదని విమర్శించారు. జాతీయ చేనేత డెవలప్మెంట్ పథకం కింద 26 బ్లాకులు మంజూరు చేయమంటే 6 ఇచ్చి చేతులు దులుపుకున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో కేంద్రాన్ని నిలదీశారన్నారు. 


Also Read: వచ్చే దసరాకు పాలనలో కొత్త వెలుగులు... రెడీ అవుతున్న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి