ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న వార్తలు వచ్చాయి. ఉద్యోగులు ప్రధాన డిమాండ్ అయిన పీఆర్సీని సోమవారం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆ దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభినట్లు తెలుస్తోంది. పీఆర్సీపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ గురువారం జరిగిన సమావేశంలో వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు. అయితే ఉద్యోగులు మాత్రం పట్టువీడనంటున్నారు. పీఆర్సీ ప్రకటించినా ఆందోళన వివమించే ప్రసక్తే లేదంటున్నారు.
పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
సీపీఎస్ రద్దు చేయాలని, ఆ బాధ్యత అంతా సీఎం జగన్ దేనని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. సీపీఎస్ రద్దు చేయకుండా ప్రత్యామ్నాయాలు అవసరం లేదన్నారు. విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ పెండింగ్ లో ఉన్న మొత్తం 7 డీఏల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలకు జీతాలు పెంచాలన్నారు.
Also Read: ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీఆర్సీ ప్రకటించినా ఉద్యయం విరమించబోం
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. పీఆర్‌సీతో పాటు ఉద్యోగుల ఇతర సమస్యలపై సీఎం జగన్ చొరవ తీసుకోవాలన్నారు. పీఆర్‌సీ ప్రకటించినప్పటికీ ఉద్యమాన్ని విరమించమని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. రెండో దశ ఉద్యమ కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని అన్ని తాలూకాల్లో నిరసన ర్యాలీలు చేపడతామన్నారు. సీఎం జగన్ పై ఉన్న గౌరవంతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్నామన్నారు. హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆపేది లేదన్న ఉద్యోగ సంఘాలు.. ఉద్యోగులంతా ఉద్యమానికి సహకరించాలన్నారు.
Also Read: కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సీపీఎస్ రద్దు చేసే వరకూ ఉద్యమం ఆగదు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారని సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అప్పలరాజు గుర్తుచేశారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీపీఎస్‌పై మూడు కమిటీలు ఎందుకు వేశారన్నారు. విజయవాడ శాతవాహన కళాశాలలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సభ నిర్వహించారు. సీపీఎస్ రద్దు ఉద్యోగుల హక్కు అని అప్పలరాజు అన్నారు. సీపీఎస్ రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి