తిరుమల శ్రీవెంకటేశ్వరునికి భక్తులు తమకు ఉన్న దాంట్లో ఎంతో కొంత మొక్కు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఎవరి స్థాయిలో వారు మొక్కులు సమర్పించుకుంటారు. అలా రూ. కోట్లలో సమర్పించుకునేవారు కూడా ఉంటారు. కొంతమంది గుప్తంగా తమ విరాళం ఇస్తారు. అలా ఓ ఆజ్ఞాత భక్తుడు దాదాపుగా రూ. మూడున్నర కోట్ల విలువైన ఆభరణాలను శ్రీవారికి విరాళంగా ఇచ్చారు.
స్వామి వారికీ ఎంతో భక్తి శ్రద్దలతో చేయించిన బంగారు కటి., వరద హస్తాలను ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి అందించారు అజ్ఞాత దాత. ఆలయంలోని మూల విరాట్ కు అలంకరించేలా ఈ ఆభరణాలను ప్రత్యేకంగా చేయించారు. 5.5 కిలోల బరువు గల బంగారు హస్తాల తయారీకి రూ 3.5 విలువ ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీవారికి స్వర్ణ కటి, వరద హస్తాలను మూలమూర్తికి ఆలయ అర్చకులు అలంకరించనున్నారు.
Also Read:శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
శ్రీవారికి భక్తితో ఇత్తిన విరాళమని ప్రచారం అవసరం లేదని కోరడంతో దాత సమాచారాన్ని టీటీడీ గోప్యంగా ఉంచింది. తిరమల శ్రీవారికి రూ. కోట్లలో విరాళాలు ఇచ్చే వారు ఎందరో ఉన్నారు. చాలా మంది బహిరంగంగానే ఇస్తూంటారు. కొన్ని వ్యాపార సంస్థలు కూడా ప్రకటిస్తూ ఉంటాయి. గతంలో గాలి జనార్ధన్ రెడ్డి అప్పట్లోనే రూ. ఐదు కోట్లు విలువ చేసే కిరీటాన్ని శ్రీవారికి విరాళంగా సమర్పించారు. ఇంకా పలువురు కార్పొరేట్ భక్తులు కూడా బంగారం సమర్పించారు. అనేక మంది వాహనలు.. ఇతర విలువైన వస్తువులు కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇంత భారీ మొత్తంలో విరాళం ఇచ్చి తమకు ప్రచారం వద్దని చెప్పేవారు తక్కువ మంది ఉంటారు.
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
భక్తులు ఎక్కువ మంది హుండీల్లో విరాళం వేస్తూ ఉంటారు. ఇలా హుండీల్లో వేసే విరాళాల్లోనూ బంగారం పెద్ద మొత్తంలో ఉంటుంది. ప్రత్యేకంగా టీటీడీ అధికారుల అనుమతితో ఆభరణాలు చేయించి కొంత మంది ఇస్తూ ఉంటారు. శ్రీవారికి విరాళం ఇవ్వడం అంటే.. దేవునికి సేవ చేయడమేననని భక్తుల నమ్మకం.
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి