ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నప్పటికీ కొత్తగా కర్నూలులో కార్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం విశేషం.  వక్ఫ్‌ భూముల పరిరక్షణకు  సంబంధించి న్యాయపరమైన అంశాలను వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ విచారణ జరుపుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న వక్ఫ్‌ ట్రిబ్యునల్‌లో పని చేసతున్న సిబ్బందిలో  తెలంగాణకు 60 శాతం, ఏపీకి 40 శాతం చొప్పున కేటాయించారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను అమరావతిలో కాకుండా కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆదేశాలిచ్చారు.


Also Read : ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం


వక్ఫ్‌ భూములు, వాటి వివాదాలను త్వరితగతిన విచారించి పరిష్కరించడంలో ట్రిబ్యునల్‌ కీలకపాత్ర పోషిస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు కాలేదు.  హైదరాబాద్‌లోని వక్ఫ్‌ ట్రిబ్యునల్‌కే ఏపీ కేసులనూ పంపిస్తున్నారు. అయితే అక్కడ విచారణ వేగంగా జరగడం లేదు. ఫలితంగా ఏపీకి చెందిన వక్ఫ్‌ భూముల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇలా దాదాపు 400 నుంచి 450 కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి పెండింగ్‌ కేసులను పరిష్కరించాలనే ప్రభుత్వం నిర్ణయించింది. 


Also Read: OTS Issue: ఏపీలో ఓటీఎస్ తంటా.. ఉద్యోగులకు మొదలైన తలనొప్పులు.. అసలు ఈ ఓటీఎస్ ఎందుకంటే..


కార్యాలయాల తరలింపు విషయంలో హైకోర్టు స్టే ఉంది.  ఇటీవల మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈ స్టేను ఎత్తి వేయలేదు. అమరావతిలో అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న ఉత్తర్వులు మాత్రం ఎత్తివేశారు. కార్యాలయాల తరలింపుపై స్టే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను తరలించడం లేదని..  ఏర్పాటు చేయడమే కర్నూలులో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది. 


Also Read : అమరావతి రైతుల భోజన ఏర్పాట్లు చేస్తున్న పొలం దున్నేసిన దండగులు ! వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనేనని ఆరోపణలు !


ఇప్పటికే కర్నూలులో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్‌లో ఉంది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ మన రాష్ట్రంలోనే ఉండి తీరాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.  ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చుని ప్రభుత్వానికి అధికారం ఉందని హైకోర్టుకూడా స్పష్టం చేయడంతో కర్నూలులో ఏర్పాటు చేసింది. అలాగే లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రధాన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేశారు.  ఈ తరహాలోనే వక్ఫ్ బోర్డు ట్రిబ్యూనల్‌నూ కర్నూలులో ఏర్పాటు చేశారు.


Also Read: East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి