న్యూజిలాండ్ క్రికెటర్ అజాజ్ పటేల్‌ను టీమ్‌ఇండియా వినూత్నంగా గౌరవించింది. క్రికెటర్లంతా సంతకాలు చేసిన జెర్సీని అతడికి బహూకరించింది. రవిచంద్రన్ అశ్విన్ స్వయంగా అతడిని ఇంటర్వ్యూ చేస్తూ ఈ జెర్సీని బహూకరించాడు.
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయడమంటే మామూలు విషయం కాదు! చరిత్రలో మొన్నటి వరకు ఈ రికార్డు ఇద్దరి పేరుతోనే ఉండేది. ఇంగ్లాండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ మొట్టమొదటి సారి ఈ ఘనత అందుకున్నాడు. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌పై 10 వికెట్లు పడగొట్టాడు. మళ్లీ 22 ఏళ్లకు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఈ రికార్డు సమం చేశాడు.
ముంబయి వేదికగా జరిగిన రెండో టెస్టులో అజాజ్ పటేల్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. ఎంతో మంది ప్రయత్నించినా అందుకోని రికార్డును దక్కించుకున్నాడు. పైగా అతడు భారత సంతతి వ్యక్తి కావడం అదే ముంబయిలో జన్మించడం ప్రత్యేకం. ఈ నేపథ్యంలో అతడికి టీమ్‌ఇండియా క్రికెటర్లు ప్రత్యేకంగా గౌరవించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ అతడిని ఇంటర్వ్యూ చేశాడు.
జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఆ తర్వాత అజాజ్ పటేల్ పది వికెట్లు తీశారని చెబుతుంటే ఏమనిపిస్తోందని పటేల్‌ను యాష్ ప్రశ్నించాడు. అందుకతడు ఎంతో సంతోషంగా ఉందని బదులిచ్చాడు. 'మీ కన్నా ఎక్కువ అనుభవం నాకేమీ లేదు' అని వినయంగా పేర్కొన్నాడు. ఆ తర్వాత తన జెర్సీపై టీమ్‌ఇండియా క్రికెటర్లు సంతకాలు చేసిన జెర్సీని అతడికి బహూకరించాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్లో పంచుకొంది.
Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్.. కిర్రాక్! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్!
Also Read: PV Sindhu: ఫైనల్స్‌లో పీవీ సింధుకి చుక్కెదురు.. ఆమె చేతిలో వరుసగా మూడో ఓటమి!
Also Read: Ashes 2021-22: యాషెస్ మొదటి టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
Also Read: India South Africa Tour: షాక్..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ!
Also Read: IND vs NZ 2nd Test: ముంబై టెస్టులో 372 పరుగులతో టీమిండియా ఘన విజయం.. కివీస్‌పై టెస్ట్ సిరీస్ కైవసం