న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో 372 పరుగుల తేడాతో కివీస్‌పై విజయఢంకా మోగించింది. ముంబై వేదికగా జరిగిన టెస్టులో 140/5తో సోమవారం ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 27 పరుగులు జత చేసి 5 వికెట్లు కోల్పోయింది. నేడు మ్యాచ్ మొదలైన 60 నిమిషాల లోపే భారత బౌలర్లు కివీస్ కథ ముగించారు. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 167 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0  తేడాతో కైవసం చేసుకుంది. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టు డ్రా కావడం తెలిసిందే.






భారత్ విజయానికి 5 వికెట్లు అవసరం కాగా, నేటి ఉదయం ఆట ప్రారంభం కాగానే జయంత్ యాదవ్ వికెట్ల వేట మొదలుపెట్టాడు. నేడు 4 వికెట్లు జయంత్ తన ఖాతాలో వేసుకోగా, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. కేవలం గంట సమయంలోనే కివీస్ చివరి 5 వికెట్లను కోల్పోవడంతో భారత్ 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్ లో డారిల్ మిచెల్ (60; 7X4, 2X6) ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించగా.. హెన్రీ నికోల్స్ (44; 8X4) పరవాలేదని పించాడు. ఈ ఇన్నింగ్స్‌లో జయంత్, అశ్విన్ 4 వికెట్లతో రాణించగా.. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ లభించింది.
Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!






న్యూజిలాండ్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి చేసిన పరుగులు 229 కాగా, భారత్ తొలి, రెండో ఇన్నింగ్స్‌ల్లోనూ ఇంతకన్నా ఎక్కువ పరుగులు చేయగం విశేషం. తొలి టెస్టులో చివర్లో తడబాటుకు లోనై డ్రా చేసుకున్న టీమిండియా తనదైన మార్క్‌తో ముంబై టెస్టు విజయంతో కివీస్‌పై టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకుంది.


భారత్ తొలి ఇన్నింగ్స్: 325 పరుగులకు ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62 పరుగులకు ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్:  276/7 డిక్లేర్డ్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 167 పరుగులకు ఆలౌట్


Also Read: IND vs NZ , Ajaz patel: అజాజ్‌ అదరహో..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన భారత సంతతి స్పిన్నర్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి