చెప్పిన పని చేయకపోతే చీరేస్తా అంటూ ఓ మహిళా అధికారిపై స్థానిక నేత తీవ్ర పదజాలంతో మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఛాంబర్ లోనే మహిళా ఎంపీడీవోపై నేదునూరు పెదపాలెం మాజీ సర్పంచ్, వైసీపీ నేత వాసంశెట్టి తాతాజీ బెదిరింపులకు దిగారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. సరిగ్గా పని చేయకపోతే చీరేస్తానని బెదిరింపులకు దిగారు.
జడ్పీటీసీ ఆగ్రహం.. కన్నీళ్ల పర్యంతమైన ఎంపీడీవో
కె.జగన్నాథపురం గ్రామంలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు, స్థానిక జడ్పీటీసీ ప్రొటోకాల్ విషయంలో గత కొన్ని రోజులుగా తనను కొందరు నేతలు టార్గెట్ చేశారని ఎంపీడీవో ఆరోపించారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ ఓ పార్టీకి చెందిన కొందరు నేతలు తననుటార్గెట్ చేస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీడీవో ఆవేదన చెందారు. మండలంలో కొంతమంది నాయకుల మాట ఆమె వద్ద చెల్లకపోవడంతో ఎంపీడీవోపై కక్ష్య గట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగనన్న ఆసరా పథకం చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించలేదంటూ జడ్పీటీసీ ఎంపీడీవో కె.ఆర్. విజయపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యారు.
Also Read: రేపటి నుంచి ఉద్యమకార్యాచరణకు సిద్ధం... నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం
స్థానిక నేతలపై డీఎస్పీకి ఫిర్యాదు
అయినవిల్లి ఎంపీడీవో కె.ఆర్ విజయపై స్థానిక నాయకుడి అనుచిత వ్యాఖ్యలను ఎంపీడీవోల సంఘం ఖండించింది. అంబేడ్కర్ వర్థంతి రోజున ఒక దళిత మహిళా ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని, బెదిరింపులకు పాల్పడిన తాతాజీతో పాటు మరో ముగ్గురిపై ఎంపీజీవో విజయ అమలాపురం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో విజయపై స్థానిక నేత దురుసు ప్రవర్తనను ఖండిస్తూ రేపు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీవోలు, కార్యాలయ సిబ్బంది హాజరు కావాలని జిల్లా ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు పి. నారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి అప్పారావు తెలిపారు.
Also Read: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి