విశాఖ మల్కాపురంలో రౌడీ షీటర్ కు మహిళలు దేహశుద్ధి చేశారు. రౌడీ షీటర్ దోమానా చిన్నారావు పుస్తకాలు, పెన్నులు ఎరచూపి బాలికతో అసభ్యంగా ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బాలిక ట్యూషన్ టీచర్ కు తెలపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ముసుగులో బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులకు పుస్తకాలు, ఇతర వస్తువులు ఇస్తానంటూ ఇంటికి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
Also Read: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారులో చెలరేగిన మంటలు... ఆరుగురు మృతి
బాలికలతో అసభ్య ప్రవర్తన
బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన రౌడీషీటర్ చిన్నారావుకు పిల్లల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. చదువుకునేందుకు సామాగ్రి ఇస్తానంటూ బాలికలను ఇంటికి తీసుకెళ్లి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారంతా ఆగ్రహంతో చిన్నారావుకు బుద్ధి చెప్పారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలను వారించి చిన్నారావును స్టేషన్ కు తరలించారు.
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
చదువు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు పిల్లలతో సొంతంటి పనులు చేయిస్తున్న ఘటన అనంతపురంలో వెలుగుచూసింది. అనంతపురం పట్టణంలోని ఆదర్శ నగర్ లో విద్యార్థులతో భవన నిర్మాణ పనులను చేయించారు. నిన్న సెలవు కావడంతో విద్యార్థులను ఆదర్శ్ నగర్లోని తన ఇంటి వద్దకు పిలిచి భవన నిర్మాణానికి కావలసిన సామాగ్రిని విద్యార్థులతో మోయించారు. ఈ విషయంపై స్థానికులు హెడ్ మాస్టర్ శివమ్మను ప్రశ్నించిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదని విద్యా హక్కు చట్టం చెబుతున్నప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు బేఖాతర్ చేస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత అవసరాల కోసం చిన్నారులను ఉపయోగించుకోవడం గర్హనీయమని స్థానికులు అంటున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండటంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. గత వారంలో సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని ఓ మోడల్ స్కూల్ లో చిన్నారుల చేత పాఠశాలలోని నీటి ట్యాంక్ ను శుభ్రం చేయించారు. ప్రమాదవశాత్తు పిల్లలు నీటి తొట్టిలో పడిపోతే ఎలా అంటూ ప్రధానోపాధ్యాయురాలని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
Also Read: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆటోను ఢీకొట్టిన జీపు, నలుగురి దుర్మరణం