ఎవ్వరికైనా జీవితం ఒకటే..కానీ..మహానటి సావిత్రికి మాత్రం రెండు వైవిధ్యమైన జీవితాలు అనాలేమో. ఎందుకంటే వెండితెరపై ఆమె వెలుగును మించిన వాళ్లు ఇప్పటి వరకూ లేరు..రారు అన్నంతగా కీర్తినందుకుంది. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం సావిత్రి లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు అన్నంతలా ఉంటుంది. పెళ్లి ఒక్కటీ ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పేసింది.  


కెరీర్ జోరుమీదున్న సమయంలోనే జెమినీ గణేషన్ ని పిచ్చిగా ప్రేమించింది సావిత్రి.  అప్పటికే పెళ్లై పిల్లలున్నారనీ, చాలామంది హీరోయిన్లతో సంబంధాలున్నాయని తెలిసి కూడా పెళ్లిచేసుకుంది. ఆ విషయంలో ఆమెను హెచ్చరించని వాళ్లు లేరు. ఐనా రహస్యంగా మైసూర్ చాముండేశ్వరీదేవి సమక్షంలో పెళ్లిచేసుకుంది.  ఆ వివాహమే ఆమె జీవితాన్ని మార్చేసింది.  సావిత్రి సినీ కెరియర్ అద్భుతంగా ఉన్నప్పుడు జెమినీ గణేషన్ ఆమెవెంటే ఉన్నాడు. తాను తాగుతూ సరదాగా సావిత్రిని తాగమని అడిగాడు. అంతకుముందు వరకూ మందు ముట్టని సావిత్రి తర్వాత మందులేకుండా బతకలేని స్థితికి వచ్చేసింది. రానురాను సినిమా అవకాశాలు తగ్గడంతో ఆదాయం తగ్గింది. అంతగా చదువుకోని సావిత్రి అమాయకురాలు. ఆర్థిక లావాదేవీలు ఎలా నిర్వహించాలో తెలియక ఎవరిని పడితే వాళ్లని నమ్మింది. అదే ఆమెకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది. 


Also Read: తెలుగు 'కళా'శాలకు ఆమె రోల్ మోడల్


తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన 'మూగమనసులు' సినిమాను సావిత్రి తమిళంలో నిర్మించాలనుకుంది. అందులో హీరోగా భర్తను సెలెక్ట్ చేసింది. కానీ గణేశన్ అభ్యంతరంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి. తన డబ్బు తన అధీనంలో లేదన్న వాస్తవం అప్పుడు తెలిసొచ్చింది. సినిమా ఆగకూడదన్న పట్టుదలతో పూర్తిచేసి విడుదల చేసింది. అంత చక్కని కథ కలిగిన సినిమాను తమిళులు ఎందుకు ఆదరించలేకపోయారో తెలియదు. ఆర్థిక నష్టం , అప్పులమీద వడ్డీలు .... తన మాట వినలేదన్న కోపంతో జెమినీ గణేశన్ ఇంటికిరావడం మానేశాడు. ఎంతగానో ప్రేమించిన భర్త దూరమవడం ఆమె  జీవితాన్నే మార్చేసింది. పతనం ప్రారంభమైంది. 


ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త ఎడబాటుని తట్టుకోలేకపోయింది. పూర్తిగా తాగుడుకు బానిసైంది. రీల్ లైఫ్ లో అద్భుతంగా జీవించడం తెలిసిన వెండితెర సామ్రాజ్జికి రియల్ లైఫ్ లో నటించడం రాలేదు. ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా  అభిమాన ధనాన్ని సంపాందించింది. ఎవరెస్ట్ అంత కీర్తినార్జించింది. అడిగిన వాళ్లకి లేదనకుండా దానధర్మాలు చేసింది. కానీ చివరకు ఆమెకు ఏం మిగిలింది. ఎన్టీఆర్, ఏన్నార్, రాజ్ కుమార్ లాంటి అగ్రస్థాయి హీరోలకన్నా అప్పట్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న సావిత్రికి చివరి రోజుల్లో చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరి దశలో కేవలం 500 రూపాయల అద్దెకు చెన్నపట్నానికి మారింది. ఆ చిన్న ఇంట్లోనే కొడుకుతో గడిపింది.


సావిత్రి ఆదాయపన్ను సక్రమంగా చెల్లించకపోవడంతో....నోటీసుల మీద నోటీసులు పంపించారు. చాలాకాలం అవి పట్టించుకోలేనంత మత్తులో ఉండిపోయింది. ఫలితం ఆదాయపన్ను శాఖవారు వడ్డీలమీద వడ్డీలు లెక్కలు కట్టి లక్షల్లో బకాయిలు చూపించి కడతారా...ఆస్తులు జప్తులు చేయమంటారా అని బెదిరింపులు మొదలెట్టారు. తాగుడు తనని పతనం చేసిందని తెలుసుకుని ఆమత్తు బానిసత్వం నుంచి బయటపడి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలెట్టింది. ఆ సమయంలో నటించిన చిత్రం 'గోరింటాకు'.  కన్నడ సినిమా షూటింగ్ కోసం బెంగుళూరు వెళ్లిన సావిత్రి తన ఆస్తులన్నీ జప్తు చేసే నోటీస్ వచ్చిందని తెలుసుకుంది. అప్పటికీ రెండుమూడేళ్లుగా  మందు మానేసిన సావిత్రి ఆరోజు హోటళ్లో మళ్లీ తాగడం మొదలెట్టింది. దగ్గర ఎవ్వరూ లేరు. తాగటం మెదలుపెట్టిన తర్వాత ఇక ఆపడం తెలియలేదు. తెప్పించుకున్న ఆహారం తినలేదు. ఆ రాత్రి నిద్రలోకి జారుకున్న సావిత్రి డయాబెటిక్ కోమాలోకి వెళ్లింది. 


బక్కచిక్కిపోయి ఎముకలగూడులా మారిన సావిత్రి శరీరంలోంచి ఒక్కో పార్ట్ పనిచేయడం మానేస్తుంటే ఎప్పటికైనా కోలుకుంటుందనే ఆశతో గొట్టం ద్వారా ఆహారం ఎక్కిస్తూ వైద్యులు చేయగలిగినంతా చేశారు. మహానటి సావిత్రి సినిమాల్లో వైవిధ్య పాత్రల్లో జీవితపోరాటం చేసింది.  కానీ వ్యక్తిగత జీవితంలో  పోరాటం చేయలేకపోయింది. చెప్పాలనుకున్న చివరి మాటలు చెప్పకుండానే 1981 డిసెంబరు 26 న శాశ్వతంగా వెళ్లిపోయింది. భావితరాలకి సావిత్రి పెద్ద నటనా నిఘంటువు. సినీ పెద్దలన్నట్టు ఆమెలా నటించడం కాదుకదా అనుకరించడం కూడా సాధ్యంకాదు. వృత్తిపై ఆమెకున్న నిబద్దత, సాటిమనిషి పట్ల సావిత్రి చూపిన మానవత ప్రతిఒక్కరికీ ఆదర్శనీయం అనుసరణీయం.


Also Read: కత్రినా కైఫ్ తొలిహిట్ బాలీవుడ్ లో కాదు.. తెలుగులోనే..
Also Read: నువ్వు ఫర్‌ఫెక్ట్ అయితే ముందు స్టార్ట్ చేయ్.. షన్నుతో సన్నీ, టాప్-1 ఎవరు?
Also Read: భీమ్... భీమ్... కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన స‌మ‌స్య‌... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: బైక్ ఫైట్, టార్చర్ సీక్వెన్స్.. 'పుష్ప'లో కేక పెట్టించే సీన్స్ ఇవే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి