నటులెందరో.. మహానటి మాత్రం ఆమెఒక్కరే. కనీసం 5 పదులు కూడా జీవించలేదు... అయితేనేం చిరస్థాయిగా నిలిచే నటనా కీర్తినార్జించింది మహానటి సావిత్రి. ఆమె సెట్లో ఉంటే ఎస్వీ రంగారావు లాంటి నటుడు కూడా నటనలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకొనేవారట. సాటి నటులకు ఆమె అంటే గౌరవం, అభిమానం. సావిత్రిని తలుచుకుంటే చాలు నటన అదే వస్తుందంటారు. వెండితెర సామ్రాజ్యానికి మకుటం లేని మహరాణిగా వెలిగిన ఆమె గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం చిర్రావూరులో 1936 డిసెంబరు 6న జన్మించింది. గురవయ్య- సుభద్రమ్మ దంపతులకు రెండో సంతానం సావిత్రి. ఆరునెలల వయసప్పుడే తండ్రి చనిపోయాడు. విజయవాడ కస్తూరిబాయి మెమోరియల్ స్కూల్లో చదువుకుంది. శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకుని చిన్నప్పుడే ప్రదర్శనలిచ్చింది. నాటకాల్లో నటించే సావిత్రి ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 'సంసారం' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత పాతాళభైరవిలో చిన్న పాత్ర పోషించింది. పెళ్ళిచేసిచూడు సినిమాలో మెప్పించింది.
'దేవదాసు' సినిమాలో సావిత్రి నట విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారంతా. అన్ని భారతీయ భాషల్లో దాదాపు 10 సార్లు విడుదలైనా ఆదరణ తగ్గలేదు. దేవదాసు తర్వాత ఓ ఏడు సినిమాల్లో నటించినా మళ్లీ బారీ హిట్టిచ్చిన సినిమా 'మిస్సమ్మ'. 1955లో వచ్చిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో సావిత్రిని అగ్ర కథానాయికగా నిలబెట్టింది. 1957 లో వచ్చిన 'మాయాబజార్' ఆమె కీర్తి పతాకంలో ఓ మైలురాయి. అక్కినేని నాగేశ్వరరావుతో కలసి నటించిన 'మూగమనసులు' అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. అప్పటి వరకూ సాఫ్ట్ పాత్రల్లో నటించిన సావిత్రి 'నర్తన శాల'లో ద్రౌపదిపాత్రలో ఒదిగిపోయింది. ఆంధ్రమహాభారతంలో తిక్కన స్పశించిన కోపం బాధ లాంటి భావాలను అత్యద్భుతంగా ఒలికించింది. ఎన్టీఆర్ తో దేవత, గుండమ్మకథ, గుడిగంటలు, కలసి ఉంటే కలదు సుఖం సహా పలు సినిమాల్లో నటించిన సావిత్రి... రక్త సంబంధం లో చెల్లెలిగా నటించి విమర్శలకు ప్రశంసలు అందుకున్నారు.
నటనకే అంకితం కాకుండా తనలో కళాభిరుచిని అందరికీ చాటిచెప్పేందుకు చిరంజీవి, చిన్నారిపాపలు, మాతృదేవత, వింత సంసారం సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తెలుగులో నటశిరోమణి, తమిళంలో కలమైమామిణి బిరుదు పొందింది. 1968 లో సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు తొలిసారిగా పూర్తిగా మహిళలే పూర్తి బాధ్యతలు నిర్వర్తించిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత చిరంజీవి,మాతృదేవత, వింత సంసారం సినిమాలకూ దర్శకత్వం వహించారు సావిత్రి.
Also Read: కత్రినా కైఫ్ తొలిహిట్ బాలీవుడ్ లో కాదు.. తెలుగులోనే..
Also Read: నువ్వు ఫర్‌ఫెక్ట్ అయితే ముందు స్టార్ట్ చేయ్.. షన్నుతో సన్నీ, టాప్-1 ఎవరు?
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన సమస్య... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: బైక్ ఫైట్, టార్చర్ సీక్వెన్స్.. 'పుష్ప'లో కేక పెట్టించే సీన్స్ ఇవే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి