డిసెంబరు 9న విక్కీ కౌశల్ ను పెళ్లిచేసుకోనున్న కత్రినా కైఫ్ బాలీవుడ్ లో టాప్ ఫైవ్ హీరోయిన్ గా కొనసాగుతోంది.  'ఏక్ థా టైగర్', 'జబ్ తక్ హై జాన్' ,'న్యూయార్క్' వంటి సినిమాలతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. అందుకే కత్రినా అనగానే బీటౌన్ అని  ఫిక్సైపోతారు.   వాస్తవానికి అమ్మడికి తొలి హిట్ ఇచ్చింది తెలుగు చిత్రపరిశ్రమే. 2004లో వచ్చిన 'మల్లీశ్వరి' మూవీలో టైటిల్ రోల్ లో నటించింది కత్రినా. 






2003లో అమితాబ్ బచ్చన్, జాకీ ష్రాఫ్ మరియు జీనత్ అమన్ నటించిన 'బూమ్' సినిమా కత్రినా తొలిచిత్రం. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో అమ్మడిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ హీరోగా నటించిన 'మల్లీశ్వరి' సూపర్ హిట్ కావడంతో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన మల్లీశ్వ రి సినిమాలో మీర్జాపురం యువరాణిగా టైటిల్ పాత్రలో కత్రినా కైఫ్ నటించింది. అప్పట్లో ఆమెకు 70 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. అప్పటి సౌత్ హీరోయిన్లతో పోలిస్తే ఎక్కువ పారితోషికం పొందిన నటి కత్రినా.  ఆ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ వీడియో ఇప్పటికీ కత్రినా ఫ్యాన్స్ ఇన్ స్టా గ్రామ్ లో ఉంది. 






మల్లీశ్వరి సక్సెస్ తర్వాత  తెలుగులో బాలకృష్ణ సరసన 'అల్లరిపిడుగు'లో నటించింది.  ఆ తర్వాత మలయాళంలో ఓ సినిమా చేసింది. ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్ లో ఫిక్సైపోయింది. ఆరంభంలో నటన, డాన్సులు మైనస్ అనిపించుకున్న కత్రినా కైఫ్ రాను రాను తానేంటో ప్రూవ్ చేసుకుంది. 'అగ్నిపథ్'  ఐటెం  సాంగ్ తో డాన్స్ లో తోపు అనిపించుకుంది. ఆ తర్వాత నటనలోనూ మెరుగుపర్చుకుని ఇప్పటికీ టాప్ 5 లో కొనసాగుతోంది. 



రీసెంట్ గా  అక్షయ్ కుమార్  'సూర్యవంశీ' మూవీలో నటనతో మెప్పించింది. త్వరలో అత్తారింట్లో అడుగుపెట్టనున్న కత్రినా వివాహం రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో  విక్కీతో జరగనుంది. 
Also Read: నువ్వు ఫర్‌ఫెక్ట్ అయితే ముందు స్టార్ట్ చేయ్.. షన్నుతో సన్నీ, టాప్-1 ఎవరు?
Also Read: భీమ్... భీమ్... కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన స‌మ‌స్య‌... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: బైక్ ఫైట్, టార్చర్ సీక్వెన్స్.. 'పుష్ప'లో కేక పెట్టించే సీన్స్ ఇవే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి