తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త జోనల్ విధానంలో భాగంగా జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను సొంత జిల్లాల్లో పని చేసేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం బదిలీలు చేసేందుకు విధివిధానాలు ఖరారయ్యాయి. జీవో కూడా జారీ చేశారు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్నవారు తమ సొంత జిల్లా లేదా అందులోని మరో జిల్లాను ఎంచుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, దివ్యాంగులు, భార్యాభర్తలు, వితంతువులు, కారుణ్య నియామకాల్లోని వారి కోసం ఆప్షన్లు కల్పిస్తారు. ఉద్యోగులకు కేడర్ల వారీ ఆప్షన్లు ఇచ్చి కేటాయింపు అవకాశం కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలను పునర వ్యవస్థీకరించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కోడ్ అమలులో లేని జిల్లాలలో వెంటనే విభజన ప్రక్రియను ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ సాఫీగా సాగేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు.
Also Read: Hyderabad Omicron: హైదరాబాద్ వచ్చిన బ్రిటన్ మహిళకు ఒమిక్రాన్ ఉందా? రిపోర్ట్‌లో ఏం తేలిందంటే..
కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. విభజన ప్రక్రియలో ఉద్యోగుల సీనియారిటీ కీలకంగా తీసుకుంటారు, లోకల్ కేడర్‌కు అనుకూలంగానే విభజన జరుగుతుంది. ఏ ఉద్యోగికీ నష్టం జరగకుండా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Also Read: Sircilla: సిరిసిల్ల యువకుడి వినూత్న ఆవిష్కరణ.. ట్రక్కులు తిరిగి ఖాళీగా రాకుండా అద్భుత ప్లాన్
జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ప్రాతిపదికన ఉద్యోగుల విభజన జరుగుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జాబితా ఖరారవుతుంది. ఆదివారం ఉద్యోగసంఘాల నేతలు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌ను కలిశారు. ఆ తర్వాతి రోజే ఉత్తర్వులు రావడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి వస్తే తర్వాత ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది.
Also Read: DH Srinivasa Rao: ఒకట్రెండు నెలల్లో భారత్ లో కరోనా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి