రాష్ట్రంలో ఉన్న 13 లక్షల ఉద్యోగస్తుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఉద్యోగులకు సంబంధించి 71 డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకు సానుకూల స్పందన లేదన్నారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధమయ్యామన్నారు. జిల్లాల వారీగా ఉద్యోగులను కలుస్తున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు... నిన్న అనంతపురం, ఇవాళ కడప జిల్లాల్లో పర్యటించారు. కడపలో మాట్లాడిన ఆయన పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా స్పందించడంలేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారుల కూడా ఆలోచన చేయాలన్నారు. పీఆర్సీని ప్రకటిస్తామని సీఎం తిరుపతిలో ప్రకటించారని కానీ ఉద్యోగస్తులను చర్చలకు పిలిచి అవమానించారన్నారు.
Also Read: ఉద్యోగ నేతలకు ఏపీ ప్రభుత్వం పిలుపు - తాడోపేడో తేల్చుకుంటామంటున్న సంఘాలు !
7 డీఏలు పెండింగ్
11వ పీఆర్సీ అమలుపై ఎందుకు చేస్తున్నాని బొప్పరాజు ప్రశ్నించారు. ఉద్యోగస్తులు కరోనా సమయంలో ప్రభుత్వానికి ఎంతో సహకరించామని ఆయన అన్నారు. ప్రధాన సమస్యగా ఉన్న 11వ పీఆర్సీ అమలు చేయడం లేదని, కేవలం పీఆర్సీలోనే అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు డీఏలు ఇస్తామన్న ప్రభుత్వం 7 డీఏలు పెండింగ్ లో పెట్టిందన్నారు. అధికారంలోని రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ చెప్పారని గుర్తుచేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల క్రమబద్ధీకరణ పెండింగ్ లో పెట్టారన్నారు. మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ కూడా చెల్లిండంలేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడంతో ఉద్యమబాట పట్టామన్నారు.
Also Read: పరిస్థితులు చక్కబడగానే ఉద్యోగుల సంక్షేమం .. ఉద్యమబాట పట్టిన యూనియన్లకు ప్రభుత్వం సందేశం !
రేపటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన
రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న సీఎం జగన్ ఉద్యోగస్తులను మాత్రం సంక్షోభంలో నెట్టేశారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆయన వివరించారు. రేపటి నుంచి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యామని తెలిపారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు. రేపటి నుంచి ప్రతి ఒక్క ఉద్యోగి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. ఈ నెల 16న అన్ని కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏ ఉద్యోగి నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే రెండో దశలో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు.