పూజా హెగ్డే కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభాస్ ఏమో తీవ్ర ఆలోచనల్లో మునిగారు. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే 'రాధే శ్యామ్' సినిమా విడుదల వరకూ వెయిట్ చేయాలి. అయితే... ఈ రోజు విడుదలైన 'సోచ్ లియా' సాంగ్ ప్రోమో చూస్తే, సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య బ్రేకప్ అయినట్టు స్పష్టం అయ్యింది. హిందీ వెర్షన్ సాంగ్ ఇది. ఈ నెల 8న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.'రాధే శ్యామ్' నుంచి ఇప్పటివరకూ రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఒకటి... 'ఈ రాతలే'. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, గాయని హరిణి ఆలపించగా... జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. సిద్ శ్రీరామ్ పాడిన మరో పాట 'నగుమోము తారలే...' కూడా విడుదల చేశారు. హిందీకి సపరేట్‌గా, తెలుగుకు సపరేట్‌గా సాంగ్స్ కంపోజ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా... హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 14న 'రాధే శ్యామ్' సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు.Soch Liya song Teaser from Radhe Shyam: