వివాహేతర సంబంధాలతో ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఓ మహిళతో వివాహేతర సంబందం పెట్టుకున్న యువకుడు చివరకు ఆమె చేతిలోనే బలైపోయాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. తనికెళ్లకు చెందిన ఓ యువకుడికి గ్రామానికే చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచుగా ఆమె ఇంటికి వెళ్లి వస్తూ అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ సంబంధం కొనసాగించాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన యువకుడు ఆ వివాహితను వేధించడం ఆరంభించాడు. దీంతో ఆమె తన భర్తతో కలిసి యువకుడిని హత్యచేసింది. అంతేకాక అది ప్రమాదవశాత్తు మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం ఆ భార్యభర్తలు పట్టుబడి కటకటాలపాలయ్యారు. 


పొలం పనులకు వెళుతుండగా పరిచయం..
కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ చందా ఎల్లారావు (22) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు తరచుగా గ్రామంలోని రైతులు పొలాల్లో పనిచేసేందుకు కూలీలను తీసుకెళ్లేవాడు. ఇలా మహిళా కూలీలను తీసుకెళ్లే క్రమంలో అతడికి గ్రామానికే చెందిన వివాహిత బానోత్‌ శివపార్వతితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో తరుచూ శివపార్వతి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఆమె కూడా అతని నుంచి డబ్బులు తీసుకునేది. కొన్నాళ్లకు శివపార్వతి భర్త రామారావుకు విషయం తెలిసి ఆమెను మందలించాడు. భార్యలో మార్పు వస్తుందని ఆశించాడు. ఈ క్రమంలో యువకుడు ఎల్లారావు మద్యానికి బానియ్యాడు. వివాహిత శివపార్వతిని వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు భరించలేని ఆమె ఎల్లారావును అంతం చేద్దామని తన భర్తతో్ కలిసి ప్లాన్ చేసింది. 
Also Read: Honour Killing: సొంత అక్క తల నరికిన తమ్ముడు.. అందుకు కన్నతల్లి సాయం, తల వేరు చేసి తల్లీకొడుకుల సెల్ఫీలు


రోకలిబండతో కొట్టి దారుణహత్య..
ఎల్లారావు 4వ తేదీ అర్ధరాత్రి మద్యం సేవించి రామారావు ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. అప్పటికే ఎలాగైనా ఎల్లారావు అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయించుకున్న శివపార్వతి దంపతులు వాళ్ల ప్లాన్‌ అమలు చేశారు. ఎల్లారావు రాగానే శివపార్వతి తలుపు తీసి లోపలికి పిలిచింది. ముందుగా సిద్ధం చేసుకున్న రోకలి బండతో ఎల్లారావు మెడ, తలపై రామారావు దాడి చేయడంతో కింద పడిపోయాడు. అక్కడిక్కడే కుప్పకూలిన ఎల్లారావు మృతి చెందాడు.


ఎల్లారావు మృతిని ప్రమాదవశాత్తుగా చిత్రీకరించేందుకు తెల్లవారుజామున 3 గంటలకు మృతదేహాన్ని రామారావు తన సొంత ఆటోలో వేసుకుని గ్రామంలోని అంగన్వాడీ సెంటర్‌ సమీపంలోని ముళ్లపొదల్లో వేశారు. ఉదయాన్నే ఎల్లారావు మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వైరా ఎసీపీ స్నేహామెహ్రా, సీఐ వసంత్‌కుమార్, ఎస్సై రాజులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో విచారణ నిర్వహించగా శివపార్వతి, రామారావు దంపతులు ఈ హత్యకు పాల్పడ్డారని ఒప్పుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 
Also Read: Visakhapatnam: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి