భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా. ఎలా తినాలి, ఎలా తినకూడదు. వాస్తవానికి తినే విధానం మీ మనస్తత్వాన్ని చెప్పేస్తుందంటారు పాకశాస్త్ర నిపుణులు. 
భోజనం చేసేవారికి ఉండకూడని లక్షణాలు
1. చేతి వ్రేళ్ళు కలపకుండా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదట. 
2. అన్నాన్ని పిసికి పిసికి తినే వారి జీవిత భాగస్వామి తనవల్ల జీవితాంతం బాధపడుతుందట
3. చేతి వ్రేళ్ళకు తిన్న తిండి అతుక్కుని ఉంటే వాళ్లు దరిద్రులట
4. ఎవరైతే వేళ్లు మొత్తం నోట్లో పెట్టుకుని జుర్రుకుంటూ తింటారో వారి వద్ద డబ్బు నిలవదు, పిశినారులు కూడా
5. చేతుల్ని నాకినాకి తినేవారు మిత్రద్రోహి, నమ్మకద్రోహి , మోసం చేసే గుణం కలిగి ఉంటారట.
6. అరచేయి సహా చుట్టుపక్కల మొత్తం నాకినాకి తినేవారికి  పరస్త్రీ వ్యామోహం అధికంగా ఉంటుందట
7. నాలుగు వేళ్లతో జుర్రుకుని తినేవాడు పిశినారి
8. మొదట కారం కలుపుకుని తినేవారు డబ్బే పరమావధి అన్నట్టు ప్రవర్తిస్తారట. వీళ్లు బంధాలకు విలువ అస్సలు ఇవ్వరు.
9. పదార్థాలన్నీ ఒకేసారి కలిపేసుకుని తినేవారి ఆలోచనలు కూడా కలగూర గంపలా ఉంటాయట. వివిధ రకాల ఆలోచనలు చేసి, అన్నింటా తలదూర్చి ఏపనీ పూర్తి చేయకుండా , ఎందులోనూ ప్రవీణ్యత లేకుండా ఉంటారట.
10. ఏ పదార్థం తినాలో తెలియక అదోసారి, ఇదోసారి కలుపుకుని గందరగోళంగా తినేవారికి జీవితంపై స్పష్టత లేదని అర్థం. ఇలాంటి వాళ్లకి ఎప్పుడు ఏం కావాలో తెలియదట.
11.  ప్రక్క వాళ్ళు ఎలా తింటున్నారో గమనించి  తినే వారు అన్నింటా అనుసరించాలనే మనస్తత్వంతో ఉంటారు
Also Read: పిల్లి మాత్రమే కాదు.. ఇవి ఎదురైనా తలచిన పనులు జరగవట..
భోజనం చేసేవారి ఉత్తమ లక్షణాలు
1. శబ్ధం చేయకుండా తినేవారు సుగుణవంతులు, ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు
2. అరచేతికి ఏమి అంటకుండా తినేవారు లక్ష్మి కటాక్షం కలవారట
3. ఉచ్ఛ్వాస నిశ్వాస్వలకు అనుగుణంగా తిoటూ ఉండే వాడి వద్ద లక్ష్మి స్థిరంగా వుంటుందట.
4. మొదట  స్వీట్ తినేవారు సాత్విక ఆలోచనలతో ఉంటారు 
చేతినిండా మెతుకులు ఉన్నా, వాటిని నాకుతూ తిన్న వారి పక్కన కూర్చున్నా చాలామంది భోజనం చేయలేరు. అందుకే పాకశాస్త్రంలో ప్రస్తావించిన ఈ విషయాల్లో ఎంత వరకూ నిజం అని వాదన పెట్టుకునే కన్నా తినేవిధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మంచిదంటున్నారు పాకశాస్త్ర నిపుణులు. 
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి