ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టాయి.  71 డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి పేరుతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కూడా దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉద్యమం ప్రారంభించారు. దాదాపుగా 13 లక్షలమంది ఉద్యోగులు తమ సంఘాల్లో ఉన్నారని .. తామంతా కన్నెర్ర చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ముందుగా ప్రకటించిన నిరసన షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి ఉద్యోగులు నల్లబ్యాడ్జిలతో విధులకు హాజరవడం ప్రారంభించారు. దశల వారీగా వచ్చే నెల వరకూ నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఉద్యోగుల్ని సన్నద్దం చేయడానికి ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు జిల్లాలు తిరిగి ఉద్యోగుల్ని సమాయత్తం చేస్తున్నారు. 


Also Read : 2024 తరవాత పొలిటికల్ రిటైర్మెంట్ .. సోము వీర్రాజు నిర్ణయం !


నిరసనల్లో పాల్గొనేది లేదన్న  రెవిన్యూ జేఏసీ !
అయితే ఉద్యోగులంతా ఏక తాటిపై లేరని కొంత మంది ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నారు. కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావులపై ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. ఏపీ రెవిన్యూ జేఏసీ చైర్మన్‌గా ప్రకటించుకున్న వీ.ఎస్. దివాకర్ అనే ఉద్యోగ సంగం నేత ముఖ్యమంత్రిపై నమ్మకం ఉందని ప్రకటన చేశారు. అమలాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన... రెవిన్యూ ఉద్యోగులు ఎవరూ నిరసనల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న జగన్‌పై నమ్మకం ఉందని ఆయన ప్రకటించారు. 


Also Read : కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !


బొప్పరాజు, బండి శ్రీనివాసరావులపై తీవ్ర ఆరోపణలు!
ఏపీ జేఏసీ నేత బొప్పరాజుపై దివాకర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా పని చేయాలని బొప్పరాజు తహశీల్దార్లను ఆదేశించారని దీనిపై దర్యాప్తు చేయాలన్నారు. చంద్రబాబు దగ్గర రూ. రెండు కోట్లు ఆయన తీసుకున్నారని బయటపడిన ఆధారాలపైనా దర్యాప్తు చేయాలన్నారు. అలాగే ఉద్యోగ సంఘాల పేర్లతో భవన నిర్మాణాల కోసం వసూలు చేసిన రూ. కోట్ల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.  ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలని దివాకర్ డిమాండ్ చేశారు. 


Also Read : ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం


ట్రెజరీ ఉద్యోగుల మద్దతూ ప్రభుత్వానికే  !
ఏపీ రెవిన్యూ జేఏసీ మాత్రమే కాదు.. ట్రెజరీ ఉద్యోగుల సంఘం కూడా ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాల్లో ట్రెజరీ ఉద్యోగులు పాల్గొనడం లేదని ప్రకటించారు. వారు  కూడా సీఎంపై నమ్మకంతో ఉన్నామని ప్రకటించారు. ఇక సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి కూడా మొదటి నుంచి ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీల కార్యాచరణను వ్యతిరేకిస్తున్నారు. ఎవరో బెదిరిస్తే ముఖ్యమంత్రి బెదిరిపోయే వ్యక్తి కాదని .. పీఆర్సీ అనుకున్న సమయానికే ప్రకటిస్తారని అంటున్నారు. ఆయన కూడా ఉద్యమానికి మద్దతుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పది రోజుల్లో పీఆర్సీ అన్న ముఖ్యమంత్రి ప్రకటనపై నమ్మకం ఉందన్నారు. 


Also Read: OTS Issue: ఏపీలో ఓటీఎస్ తంటా.. ఉద్యోగులకు మొదలైన తలనొప్పులు.. అసలు ఈ ఓటీఎస్ ఎందుకంటే..


చీలిపోయిన ఉద్యోగసంఘాలు !
మొత్తంగా చూస్తే ప్రధాన ఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టాయి. ట్రెజరి, రెవిన్యూ వంటి వాటిల్లో ఉన్న పెద్దగా సభ్యులు లేని ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నాయి. అయితే వారు.. బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వంటి నేతలపై వ్యక్తిగతంగా ఉన్న వ్యతిరేకత కారణంగానే ఇలాఅంటున్నారని.. కానీ ఉద్యోగుల సమస్యల విషయంలో వారూ ప్రభుత్వంపై సంతృప్తిగా లేరన్న వాదనను మరికొంత మంది వినిపిస్తున్నారు. 


Also Read : అమరావతి రైతుల భోజన ఏర్పాట్లు చేస్తున్న పొలం దున్నేసిన దండగులు ! వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనేనని ఆరోపణలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి