స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మీక మందన్నా జంటగా నటిస్తున్న ‘పుష్ప: ద రైజ్’ సినిమా నుంచి శుక్రవారం ‘‘ఊ అంటావా.. ఊఊ అంటావా..’’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. సమంతపై చిత్రించిన ఈ ఐటెమ్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండవ్వుతోంది. అయితే, ఇదే పాటను ఓ నెటిజన్ బ్రహ్మానందం సీన్లతో రీమిక్స్ చేసి.. ట్వీట్ చేశాడు. అంతే.. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఆ పాటను స్వరపరిచిన దేవీశ్రీ ప్రసాద్ కూడా రిట్వీట్ చేసుకున్నాడు. 

Continues below advertisement


‘‘This is Hilarious !!! Superrr Edit !!’’ అంటూ దేవిశ్రీ ఈ వీడియోను రీట్వీట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజనులు.. రీట్వీట్ చేసుకుంటున్నారు. ఈ పాటను బ్రహ్మీ ఎక్స్‌ప్రెషన్స్‌తో భలే ఎడిట్ చేశారంటూ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.





ఐటెమ్ సాంగ్స్‌పై ప్రత్యేక ఆసక్తి చూపించే దేవి శ్రీ ప్రసాద్ డిఫరెంట్ ట్యూన్‌తో వచ్చారు. తెలుగులో ఈ పాటను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహన్ ఆలపించారు. తమిళంలో ఇదే పాటను సింగర్ అండ్ హీరోయిన్ ఆండ్రియా ఆలపించారు. కన్నడలో తెలుగమ్మాయి మంగ్లీ పాడారు. మలయాళంలో రమ్యా నంబీశన్ పాడారు. ఒక్కో భాషలో ఒకొక్కరి చేత దేవిశ్రీ పాటను పాడించారు.






Also Read: మావా... ఊ అంటావా? ఊ ఊ అంటావా? సమంత సాంగ్ వచ్చేసింది. చూశారా?


ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 17న విడుదల కానుంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్, ధనుంజయ తదితరులు సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. 


ప్రభాస్ వెర్షన్: 






Also Read: హమ్మయ్య.. ఆ ‘శబ్దాలు’ తగ్గుతాయ్.. కత్రినా-విక్కీలపై అనుష్క కొంటె కామెంట్స్
Also Read: వరుణ్ తేజ్ 'గని' విడుదల వాయిదా... ఎందుకంటే?
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే? 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి