మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'గని'. ఇందులో సయీ మంజ్రేకర్ కథానాయిక. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. తొలుత ఈ నెల 24న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదు. విడుదల వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది. అలాగే, థియేటర్లలో మాత్రమే సినిమా విడుదల అవుతుందని స్పష్టం చేసింది.

'గని' సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు సినిమా విడుదల వాయిదా వేయడానికి గల చిత్రబృందం వివరిస్తూ "మా అందరి హృదయాలకు దగ్గరైన సినిమా 'గని'. ఈ సినిమా నిర్మాణంలో మేం ఎంతో శ్రమించాం. ఖరీదైన సెట్స్ వేయడం దగ్గర నుంచి అందమైన ప్రదేశాలకు వెళ్లి చిత్రీకరణ చేశాం. ప్రేక్షకులకు బెస్ట్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని... ఏ విషయంలోనూ మేం రాజీ పడలేదు. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అలాగే, రాబోయే రోజుల్లో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందుకని, పోటీ ఉండకూడదని... అందరికి వసూళ్లపై ప్రభావం పడుతుందని మా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. త్వరలో థియేటర్లలో మా సినిమాను విడుదల చేస్తాం" అని పేర్కొన్నారు.


కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు నటించారు.
Also Read: చివరిసారిగా పాడుతున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్..
Also Read: చిక్కుల్లో పడ్డ స్టార్ హీరో సినిమా.. నిర్మాతలపై చీటింగ్ కేసు..
Also Read: ఇద్దరు 'బిగ్ బాస్' బ్యూటీలు... ఓ హారర్ ఎంటర్టైనర్!
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?
Also Read: షన్నును ఇంప్రెస్ చేయమంటే హగ్గిచ్చిన సిరి... ‘అయిపాయ్’ అంటూ కాజల్ కామెంట్, కామెడీతో ఇరగదీసిన హౌస్ మేట్స్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి