'బిగ్ బాస్' రియాలిటీ షోలో సందడి చేసిన ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. వాళ్లిద్దరిలో ఒకరి తేజస్వి మదివాడ కాగా... మరొకరు అషు రెడ్డి. తెలుగు 'బిగ్ బాస్' రెండో సీజన్‌లో తేజస్వి మదివాడ పార్టిసిపేట్ చేశారు. మూడు సీజన్‌లో అషు రెడ్డి సందడి చేశారు. 'బిగ్ బాస్' కంటే ముందు అషు రెడ్డి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అయితే... ఆ షో ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. తేజస్వి మదివాడ 'బిగ్ బాస్' కంటే ముందు సినిమాల్లో చేశారు. ఇప్పుడు వీళ్లిద్దరూ 'సర్కస్ కార్ 2' సినిమా చేస్తున్నారు.
నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహించిన సినిమా 'సర్కాస్ కార్'. ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. 'సర్కస్ కార్-2' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా తేజస్వి మదివాడను ఎంపిక చేశారు. అషు రెడ్డి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. "నేను 'సర్కస్ కార్' చూశా. చాలా బాగా నచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వెల్‌లో కథానాయికగా నటించే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత శివరాజ్ గారికి థాంక్స్ సీక్వెల్ స్టోరీ కూడా గ్రిప్పింగ్‌గా ఉంది" అని తేజస్వి మదివాడ అన్నారు. ఈ సినిమాను ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వీకే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుగుతోంది.
"దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఓ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు... వాటి వల్ల ఏర్పడే పరిణామాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని మా 'సర్కస్ కార్ 2' అందిస్తుంది. దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్, తేజస్వి మదివాడ, అషు రెడ్డికు మంచి పేరు తెస్తుంది" అని శివరాజు వీకే అన్నారు. ఈ చిత్రానికి చైతన్య సంగీత దర్శకుడు.
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?
Also Read: షన్నును ఇంప్రెస్ చేయమంటే హగ్గిచ్చిన సిరి... ‘అయిపాయ్’ అంటూ కాజల్ కామెంట్, కామెడీతో ఇరగదీసిన హౌస్ మేట్స్
Also Read: కత్రినా నిశ్చితార్థపు ఉంగరం, మంగళసూత్రం ఎంత ఖరీదో తెలుసా?
Also Read: 'ముగింపు లేదా' అంటూ మంచు లక్ష్మిపై రామ్ గోపాల వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి