గుడ్లగూబ'ను చాలామంది అశుభానికి ప్రతీకగా భావిస్తారు. గుడ్లగూబ కనిపిస్తే ఏదో కీడు జరుగుతుందని భయపడతారు. ఒకవేళ ఇంట్లోకి వస్తే కొంతకాలం పాటూ ఆ ఇల్లే వదిలిపెట్టి వెళ్లాలని.. అది కనిపించిన పరిసరాల్లో చావు మాట వినిపిస్తుందని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే గుడ్లగూబపై ఎవ్వరికీ పాజిటివ్ అభిప్రాయం లేదు. అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూబను మించిన శుభ శకునం మరొకటి లేదని చెబుతోంది. సిరులు కురిపించే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ. లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసినప్పుడు గరుత్మంతుడి వాహనాన్ని, ఒంటరిగా ప్రయాణించ వలసి వచ్చినప్పుడు గుడ్లగూబను అధిరోహించేదని అంటారు. 'ఉల్లూక తంత్రం'లో గుడ్లగూబ దర్శనం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతారు.
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి.
గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందంటే...
పూర్వకాలం ఓ వృద్ధ జంట తినడానికి తిండి , కట్టుకునేందుకు బట్ట లేని స్థితిలో ఉండేవారట. నిత్యం భిక్షాటనకు వెళ్లొచ్చేవారు. ఓ రోజు ఏమీ దొరక్కపోవడంతో కలతచెంది ఓ చెట్టుకింద కూర్చుని బాధపడుతుండగా..ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ ఆ కష్టాలు వింటుంది. వాళ్ల కష్టం తీర్చాలనుకుని డిసైడైన గుడ్లగూబ లక్ష్మీదేవిని అనుసరిస్తూ వెళ్లింది. అమ్మవారు ఏ ఇంట్లో కాలు మోపేందుకు ప్రయత్నించారో ఆ ఇంటిమీద వాలి అరుస్తుంటుంది. శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మిదేవి ప్రవేశించకూడదు. దీంతో లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెనుతిరుగుతుంది. అలా ఏ ఇంటికి వెళ్లినా గుడ్లగూబ ముందే అక్కడకు చేరి అరుస్తూ.. ఆ వృద్ధ దంపతుల ఇంటికి చేరేలా చేస్తుంది. వారి పరిస్థితి చూసి చలించిపోయిన లక్ష్మీదేవి వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తుంది. తన అవసరం ఎక్కడుందో ఆ ఇంటికి దారిచూపిన గుడ్లగూబను ఆ రోజు నుంచి లక్ష్మీదేవి వాహనంగా చేసుకుందని చెబుతారు. అప్పటి నుంచి కష్టాల్లో ఉన్నవారింటింకి లక్ష్మీదేవిని తీసుకెళ్లే వాహనంగా మారిందట గుడ్లగూబ.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
తెల్లవారుజామున గుడ్లగూబ ఎవరింటి పై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ ఎడమవైపున కనిపిస్తే వెళుతోన్న పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది. గర్భవతిని గుడ్లగూబ తాకడం వలన మంచి సంతానం కలుగుతుందట. గుడ్లగూబ ఇంటి ఆవరణలో గానీ... పశువుల శాలలో గాని, పొలంలోని చెట్లపై గాని నివాసముంటే, ఆ యజమానికి పాడిపంటలకు ... సుఖసంతోషాలకు కొదవ ఉండదని చెబుతారు. అయితే ఎన్ని కథలు చెప్పినా.. ఇప్పటికీ గుడ్లగూబను అశుభానికి సూచికగా భావిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు.
Also Read: క్రిస్మస్ ని డిఫరెంట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి