2022 Yearly Horoscope: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
ABP Desam | RamaLakshmibai | 15 Dec 2021 11:15 AM (IST)
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి.
2022 వార్షిక రాశి ఫలితాలు
రెండేళ్లుగా కరోనా చెడుగుడు ఆడేస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త సర్దుమణుగుతోంది. గడిచిన బ్యాడ్ డేస్ ని వదిలేసి సరికొత్తగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారంతా. కొత్త ఆశలు, ఎన్నో కోర్కెలు, మరెన్నో అంచనాలతో 2022 కి వెల్ కమ్ చెప్పనున్నారు. మరి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2022 కొత్త ఏడాదిలో సింహం, కన్య, తుల, వృశ్చక రాశిఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
సింహంఈ రాశి వారికి 2022 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఏడాది ఆరంభంలో మీ జీవితంలో సానుకూల మార్పులు ఉండొచ్చు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి, ఆదాయం పెరుగుతుంది. ఏడాది మధ్యలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కెర కెరీర్ పరంగా 2022 మీకు అదుర్స్ అనేలా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు పొందడమే కాదు..ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న పాత సమస్య కొత్త ఏడాదిలో ఓ కొలిక్కి వస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారులకు మొదటి మూడు నెలలు మినహా మిగిలిన తొమ్మిది నెలలు అనూకూలంగా ఉంటుంది.
కన్య కన్య రాశివారికి కొత్త ఏడాది బాగా కలిసొస్తుంది. ఏడాది మొదలైన వెంటనే ఏదో రిలీఫ్ గా ఉంటుంది. ఆర్థికం పరిస్తితి బావుంటుంది. హార్ట్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు. ఈ ఏడాది అన్నిరంగాల వారూ విజయం సాధిస్తారు. తలపెట్టిన పనిలో ఏదైనా అడ్డంకి వచ్చినా అవలీలగా అధిగమించగలరు. ధైర్యంగా దూసుకెళతారు. మీ వ్యక్తిగత జీవితంలో కాస్త హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కెరీర్ పరంగా చూస్తే ఏడాది మొత్తం అన్నీ అనుకూలఫలితాలే గోచరిస్తున్నాయి. పెద్ద పెద్ద అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో మార్పులు, బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఊహించని లాభాలందుకుంటారు. Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
తులఈ రాశి వారికి 2022 కొత్తకొత్తగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే సంకేతాలున్నాయి. వ్యాపారులకు సవాల్ గా ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సిందే. మీరు చాలా సులువుగా పూర్తిచేసే పనుల్లో ఆటంకాలు ఎదురవొచ్చు. ఈ రాశి అవివాహితులకు నవంబర్ తర్వాత పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి పొందొచ్చు. మార్చి తర్వాత కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కెరీర్ పరంగా చూస్తే గతేడాది కన్నా ఈ ఏడాది మెరుగ్గానే ఉండనుంది. వాహన పరిశ్రమ, సినిమా రంగాలకు సంబంధించిన వారికి మంచి సమయం.