దేవుడిపై భక్తి ఉన్నవాళ్లంతా గుళ్లు గోపురాల చుట్టూ ప్రదిక్షిణ చేయకపోవచ్చు కానీ చాలామందికి గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది. అయితే అదేదో మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలుకూడా ఉన్నాయి. సాధారణంగా భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు నిర్మించారు. అందుకే అలాంటి ఆలయాల్లో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంత పవిత్రమైన ప్రదేశానికి వెళ్లినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. 
Also Read: పూజ కోసం ఈ పూలు చెట్టునుంచి కోయకూడదు, ఎవ్వరి దగ్గరా తీసుకోకూడదు..ఎందుకో తెలుసా..
ఆలయానికి వెళ్లే వారు పాటించాల్సిన నియమాలు
1. ఆలయంలోకి అడుగుపెట్టగానే చాలామంది ప్రదిక్షిణలు చేస్తారు.అయితే అంతకన్నా ముందే  దైవానికి ప్రసన్నమైన మనస్సుతో నమస్కారం చేసి నిదానంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి.
2. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం, ధ్వజ స్ధంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ దాటకూడదు.
3. యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకుని, చెవికి తగిలించుకుని, అపసవ్యంగా వేసుకుని ఆలయంలోకి ప్రవేశించకూడదు.
4. మనసునిండా ఆలోచనలతో దేవుడిని దర్శించుకోరాదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్దాలు చెప్పకూడదు.
5. దేవాలయంలో దేవుడికి వెనుకగా కూర్చోరాదు. శివాలయంలో లింగం, నందికి మధ్యలో నడవకూడదు. శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు, బయట చేయొచ్చు.
Also Read: కాళ్లకు మెట్టెలు పెట్టుకునేది పెళ్లైందో లేదో తెలుసుకునేందుకు కాదు..
6.  దేవాలయంలో ప్రవేశించి భక్తితో ఏడవకూడదు. ఏడుస్తూ దేవుడిని స్తుతించకూడదు
7. గంజి పెట్టిన వస్త్రాలు వేసుకుని దేవుడిని దర్శించుకోకూడదు
8. ఖాళీ చేతులతో గుడిలోకి వెళ్లకూడదు
9. దేవాలంలో స్వార్ధంతో కూడిన మాటలు, ప్రవర్తన ఉండ కూడదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి.
10. సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు ధరించకూడదు.
11. మహిళల నుదిటన కుంకుమ బొట్టు ఉండాలి. 
Also Read: ఈ సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్ లో ఉంటే దృష్టి దోషాలు తగలవు, దుష్ట శక్తులు పారిపోతాయట...
12. జుట్టు విరబోసుకుని దేవాలయాలు దర్శించ కూడదు.
13. మాసిన, చిరిగిన వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు. ఉతికిన బట్టలే వేసుకోవాలి.
14. గుడిలో మొదట ధ్వజ స్థంబం శిఖరం దర్శించి మూడు ప్రదక్షిణలు చేయాలి. గుళ్ళో గోమాత ఉంటే గ్రాసం ఇచ్చి ప్రదక్షిణలు చేయాలి.
15. గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలి పీఠాలను తాకకూడదు.
16. గుళ్ళో దేవునికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు
17. ఇంటి నుంచి తీసుకువెళ్ళి నివేదించిన ప్రసాదం భక్తులకు పంచేయాలి.
18. గుడి దగ్గర యాచకులకు తోచిన సహాయం తప్పక చేయాలి. 
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!

  
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి