హైదరాబాద్‌లోని ఓ బిజీ ఏరియాకు ఇద్దరు హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకువెళ్లారు. ఈ ముగ్గురి కలయికలో తెరకెక్కుతోన్న సినిమా 'ఎఫ్ 3'. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. అదీ ఎప్పుడూ బిజీగా ఉండే ఛార్మినార్, ఆ పరిసర ప్రాంతాల్లో! శనివారం ఉదయం ఏడు గంటలకు షూటింగ్ మొదలైంది. సూఫీ సంగీతకారుల వేషధారణలో కొందరు, ముస్లిం టోపీ ధరించి మరికొందరు ఉన్నారు. సినిమాలో ఓ పాటను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇంతకు ముందు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద కూడా షూటింగ్ చేశారు. చూస్తుంటే... 'ఎఫ్ 3'లో హైదరాబాద్ నేపథ్యంలో సన్నివేశాలు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి.
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన 'ఎఫ్ 2' భారీ విజయం సాధించింది. ఆ సినిమాకు ఇది సీక్వెల్ కాదు, కానీ అందులో క్యారెక్టరైజేషన్స్ తీసుకుని కొత్త కథతో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. 'ఎఫ్ 2'లో వెంకటేష్ జోడీగా నటించిన తమన్నా, వరుణ్ తేజ్ జంటగా కనిపించిన మెహరీన్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. మళ్లీ వాళ్ల సరసన నటిస్తున్నారు. కొత్తగా కథానాయిక సోనాల్ చౌహన్‌ను తీసుకున్నారు. ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి.
'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఎఫ్ 2' సంక్రాంతికి విడుదలైంది. ఈసారి పండక్కి కొంచెం వెనక్కి వెళ్లారు. 'బొమ్మ ఎప్పుడు పడితే... అప్పుడే నవ్వుల పండగ' అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
Also Read: ఏందీ గిల్లుడు? ఏందీ కితకితలు?? ఎన్టీఆర్, చరణ్ మహా చిలిపి సుమీ!
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఫ్రెండ్స్‌తో ఎన్టీఆర్ మాట్లాడతారా?
Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
Also Read: దేవిశ్రీ ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా? ఊ అంటారా... ఉఊ అంటారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి