కొడుకుని తలుచుకుంటూ సౌందర్య కుమిలి కుమిలి ఏడుస్తుంది. మనవరాళ్లతో సంతోషంగా గడిపిన సమయం తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆదిత్య రాకతో.. కార్తీక్ గురించి ఏమైనా తెలిసిందా? అని సౌందర్య అడుగుతుంది. ఫోన్ నంబర్లు కూడా మార్చేశారు దొరకడం కష్టం అని ఆదిత్య అంటాడు. ఇలా ఎందుకు చేశారు మన నుంచి పూర్తిగా దూరం అవ్వాలని అనుకున్నారా ఏంటని సౌందర్య అంటుంది. ఏదో కోపం వెళ్లి ఉంటారు మళ్లీ వస్తారని అనుకున్నా అంటూ ఆనంద్ రావు బాధపడతాడు. అసలే అన్నయ్య చాలా సెన్సిటివ్.. ఆ మోనిత వల్ల ఎన్నో ఎదురుదెబ్బలు,అవమానాలు పడ్డాడు అని ఆదిత్య ఫీలవుతాడు. అవునురా మనకు తెలీదు కానీ నరకం అనుభవించాడని ఆనందరావు కంటతడి పెట్టుకుంటాడు. అన్నింటిని తట్టుకున్న అన్నయ్య ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడో వాళ్లంతట వాళ్లు మనసు మార్చుకుంటే తప్ప మనం తెలుసుకోలేం అని ఆదిత్య అంటాడు. మోనిత విషయంలో గట్టిగా ఉండాలని ఆదిత్య అంటే.. ఇప్పుడు అది ఎందుకు రా అని సౌందర్య అంటుంది.. బయటకు వెళ్తే అందరూ అన్నయ్య గురించి కాకుండా మోనిత గురించి అడుగుతున్నారు అని ఆదిత్య ఏదో చెప్పబోతోంటే.. ఒరేయ్ మళ్లీ పెద్దోడు ఇంటికి వస్తాడా?. నన్ను మమ్మీ అని పిలుస్తాడా? అంటూ సౌందర్య ఏడుస్తుంది.
Also Read:  ఈ సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్ లో ఉంటే దృష్టి దోషాలు తగలవు, దుష్ట శక్తులు పారిపోతాయట...
ఇక దీప ఆ గ్రామంలో ఉన్న గుడిలో దండం పెట్టుకుంటుంది.  నేను నిన్ను ఎప్పుడూ నిందించలేదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రవహించే నీళ్లలా ప్రయాణిస్తూనే ఉన్నాను. పదకొండేళ్ల తరువాత కలిశానంటే మళ్లీ ఇలా డాక్టర్ బాబు నిస్సహాయ స్థితిలోకి వచ్చాడు అలాంటప్పుడే నేను అండగా ఉండాలి.. అన్నీ బాగుంటే అందరూ వచ్చి చేరతారు. కష్టాల్లో నేను ఆయనకు అండగా ఉండే ధైర్యాన్నివ్వమ్మా... ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో పిల్లలు ఉన్నారు వాళ్లు మామూలు స్థితికి వచ్చేలా చేయమని, మళ్లీ నా డాక్టర్ బాబుని డాక్టర్ బాబుగా మారేట్టు చేయి అని నమస్కారం చేస్తుంది. 
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
కార్తీక్ ఫోన్ దొరికిన బిచ్చగాడు  ఫోన్ కాస్ట్ లీ అనుకుంటా.. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందట,  అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయ్, ఓ వారానికి సరిపడా వస్తాయేమో చూడబోతే బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు. వాళ్లకి సమాధానాలు చెబితే నాకేంటి.. ఓరీ మహేషా?.. కష్టాల్లో ఉన్నావ్.. నువ్ ఈ ఫోన్ అమ్ముకుని ఎంజాయ్ చేయ్ రా అని ఇచ్చాడంటే తనలో తాను అనుకుంటాడు. పదే పదే కాల్స్  రావడంతో దాన్ని స్విచ్చాఫ్ చేస్తాడు. మరోవైపు దీప గురించి తెలుసుకునేందుకు సౌందర్య బస్తీకి వెళ్లి ఆరాతీస్తుంది. వారణాసి నీకు తెలీకుండా ఉంటుందా? దీప ఎక్కడికి వెళ్లింది అంటూ సౌందర్య అడుగుతుంది. అక్క నాకు చెబితే ఇలా చేస్తానా? కాళ్లు పట్టుకుని ఆపుతాను అంటాడు వారణాసి. పిల్లలను, కార్తీక్‌ను, దీపను చూడకుండా ఉండలేకపోతోన్నాను ఎక్కడున్నారో మీకు తెలిస్తే చెప్పండని సౌందర్య ప్రాధేయ పడుతుంది. వచ్చింది స్థలం చూసింది,  అందరికీ భోజనాలు పెడుతుందని చెప్పింది, మాతోనే ఉంటుందని చెప్పింది కానీ ఇంతలోనే ఇలా చేసిందంటూ బస్తీవాసులు అంటారు. 
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
కొత్తింట్లో దీప పడకలు వేస్తుంది. డాక్టర్ బాబు రండి అని దీప, నాన్న నువ్ కూడా వచ్చి పడుకో అని పిల్లలు అంటారు. సారీ రా రౌడీ,  సారీ హిమ.. ఇలాంటి ప్లేస్‌కు తీసుకొచ్చి కష్టపెడుతున్నాను నా వల్ల నువ్, మీ అమ్మ ఎంతో కష్టపడ్డారు అని కార్తీక్ అంటే.. ఇవన్నీ మాకు అలవాటే.. బస్తీలో ఎన్ని కష్టాలు పడ్డా నువ్ మా పక్కన లేవు కదా?.. నువ్ ఇప్పుడు ఉన్నావ్ కదా? ఏది కష్టమనిపించదు.. అని శౌర్య అంటుంది. రౌడీ అంటాం కానీ మంచి రౌడీవే అంటాడు కార్తీక్. మనం కలిసి ఉంటే చాలు మనకేం లేకపోయినా ఓకే అని పిల్లలిద్దరూ అంటారు. ఈ లోగా బయటి నుంచి శ్రీవల్లీ ఓర్చుకో అనే ఏడుపు వినిపిస్తుంది. స్పందించిన దీప ఎవరికో బాగా లేనట్టుంది చూద్దాం పదండి అని దీప అంటుంది. వద్దు అంటాడు కార్తీక్.  తెలిసి కూడా వెళ్లకుండా ఉంటామా అంటుంది దీప.  శ్రీవల్లి ఓర్చుకో అమ్మ అంటూ పురిటి నొప్పులు పడుతుంటే వాళ్లంతా సాయం చేస్తుంటారు. ఊళ్లో డాక్టర్ పెళ్లికి వెళ్లాడు, సమయానికి మంత్రసాని కూడా లేదని బాధపడతారు. ఈ లోగా అక్కడకు వెళతారు డాక్టర్ బాబు, దీప డాక్టర్ పిల్లలు. పిల్లలు మా నాన్న కూడా డాక్టరే అని చెప్పబోతుంటే కార్తీక్ వద్దని చెబుతాడు. మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయోచ్చు కదా అని దీప అడగడంతో . నాలో డాక్టర్ ఎప్పుడో చచ్చిపోయాడు దీప అని కార్తీక్ అంటాడు. డాక్టర్ బాబు.. ఆ అమ్మాయి చచ్చిపోతుంది అని దీప ప్రాధేయపడుతుంది. మనం వెళ్దామా? అని డాక్టర్ బాబు అడుగుతాడు.. డాక్టర్ బాబు వెళ్లడం ఏంటి?.. ఆ అరుపులు వినిపించడం లేదా? అని దీప అంటే నన్ను డాక్టర్‌గా తొలగించిన అరుపులే వినిపిస్తున్నాయని డాక్టర్ బాబు బాధపడుతుంటాడు. మీరేం చేయలేరా? అని దీప అడిగితే.. ఏం చేయలేను అని కార్తీక్ అంటాడు. ఆ పేషెంట్ భార్య మాటలే వినిపిస్తున్నాయని అంటాడు కార్తీక్. ఎవరి ఫోనైనా ఇవ్వమను అని కార్తీక్ అడిగి అంబలెన్స్ కి కాల్ చేస్తాడు. ఆ తర్వాత మీరు చెట్టుకింద ఉన్నారేంటని దీప అడుగుతుంది. స్పందించిన శ్రీవల్లి భర్త..ఇప్పుడు మీరున్న ఇల్లు మాదే అని అప్పుచేసి తీర్చనందుకు ఇల్లు స్వాధీనం చేసుకున్నారని చెబుతాడు. శ్రీవల్లిని ఆసుపత్రికి తీసుకెళతారు. మీరొక డాక్టర్ అనే విషయాన్ని మర్చిపోయారా అని దీప అడుగుతుంది. నేను ఇప్పుడు డాక్టర్‌ని కాదు..పట్టా తీసేశారు అని కార్తీక్ చెబుతాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. 
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
సోమవారం ఎపిసోడ్
సోమవారం ఎపిసోడ్‌లో దీప మళ్లీ వంటలక్క అవతారం ఎత్తింది. డాక్టర్ బాబు కాస్తా ఎరువుల కొట్లో అకౌంట్స్ చూస్తాడట. మీ డాడీ డాక్టర్ అని ఎవ్వరితో చెప్పకండి అని పిల్లలకు కార్తీక్ చెబుతాడు. మరి మీ డాడీ ఏం చేస్తాడని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని పిల్లలు ప్రశ్నిస్తాడు. ఎరువుల కొట్లో అకౌంట్స్ రాస్తాడని చెప్పండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. పిల్లలు కూడా ఏడుస్తారు. చూస్తుంటే మరింత ఎమోషనల్ గా సాగేట్టే ఉంది సీరియల్. 
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి