Gold Rate Today Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు వరుసగా రెండోరోజు నిలకడగా ఉంది. వెండి ధరలో భారీ తగ్గుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,960 గా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,050 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.700 మేర భారీగా పతనం కావడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,800గా ఉంది. కొన్ని నెలల తరువాత వెండి 65 వేల రూపాయల కిందకు దిగొచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దాదాపు ఇదే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,960 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,050 అయింది. ఇక్కడ వెండి ధర కేజీ రూ.64,800 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర నిలకడగా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,960 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,050 అయింది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,400 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,110 గా ఉంది. చెన్నైలో ధర రూ.200 మేర దిగొచ్చింది. ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,050గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉంది.


ప్లాటినం ధర తగ్గింది..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.26 మేర తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,910 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.


పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్‌ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!
Also Read: Social Media: భార్యను ట్రోల్‌ చేశారని.. బ్లాక్‌చైన్‌తో సొంత సోషల్‌ మీడియా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి