మేషం
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు రానివ్వొద్దు. ఇంటికి దూరంగా ఇతర నగరాల్లో పనిచేసే వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. కొన్ని కారణాల వల్ల అధికారులు మీపై కోపంగా ఉండొచ్చు.  కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. వ్యాపారులకు పెద్దగా మార్పులేమీ ఉండవు.
వృషభం
ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయగలుగుతారు. ఎప్పటినుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది.  వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  ఇంట్లో-కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి.  ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. 
మిధునం
మీ మంచి కోరుకునేవారిచ్చే సూచనలు పాటిస్తారు. వ్యాపారులకు లాభం వస్తుంది. వృత్తి సంబంధ సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలొస్తాయి.  ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read: ఈ సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్ లో ఉంటే దృష్టి దోషాలు తగలవు, దుష్ట శక్తులు పారిపోతాయట...
కర్కాటకం
మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈరోజు పెట్టుబడులు పెట్టడం సరికాదు. పొట్టకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.  తీవ్రమైన విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపవద్దు. అలసట వల్ల చికాకు కలుగుతుంది. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు.
సింహం
ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.  కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఏ పనీ చేయకూడదు. వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుంది. పిల్లలపై ప్రేమ పెరుగుతుంది. ప్రేమికుల మధ్య సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కన్య
ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. మీ పనులు చాలా వరకు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. శారీరకంగా కాస్త  బలహీనంగా ఉంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి శుభసమయం. మీరు కోరుకున్న పని చేసే అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ వ్యక్తిత్వం  మరింత ఉన్నతంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయండి. 
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
తుల
ఈరోజు మంచి రోజు అవుతుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో రహస్య విషయాలను పంచుకోవద్దు. మీరు మీ భాగస్వామికి చాలా సమయం ఇస్తారు. వారి ప్రవర్తన ద్వారా ఓ అంచనాకు వస్తారు.  కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.
వృశ్చికం
కొత్తగా ప్రారంభించే పనులు సక్సెస్ అవుతాయి. పెద్దల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. అపరిచితులను నమ్మొద్దు.  కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి.  మీరు కష్టపడి చేసిన పనివల్ల ఆహ్లాదకరమైన ఫలితాన్ని పొందుతారు. ఈరోజు  పాత స్నేహితులను కలుసుకోవచ్చు.
ధనుస్సు 
ఈ రోజు సంతోషంగా ఉంటారు. కుటుంబంతో మంచి సమయం గడపగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏ పని విషయంలోనూ తొందరపడకండి. విద్యార్థులు విజయం సాధిస్తారు. అవసరమైన పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు. మీరు మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు.
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
మకరం
ఈరోజు మకర రాశివారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి.  విద్యార్థులకు చదువుపై  శ్రద్ధ తగ్గుతుంది. కుటుంబంలో కలహాల వాతావరణం ఉంటుంది. ప్రతికూలత నుంచి దూరంగా ఉండేందుకు  ప్రయత్నించండి. పనికిరాని వాటికోసం మీ సమయాన్ని వృథా చేయకండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
కుంభం
ఒకేసారి ఎన్నో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించవద్దు. అనుకున్న కోరిక  నెరవేరుతుంది. గతంలో ఉన్న వ్యాధి నుంచి బయటపడతారు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించండి. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోడానికి మీ దినచర్యలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో గడుపుతారు.
మీనం
మీరు కొన్ని బాధల నుంచి ఉపశమనం పొందుతారు. మీ భాగస్వాములతో  సంబంధాలు బలంగా ఉంటాయి. కెరీర్ సంబంధిత విజయం సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. శారీరక బాధలు దూరమవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  టెన్షన్ తగ్గుతుంది. యాత్రకు వెళ్ళొచ్చు. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!

  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి