పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. మీరు పుట్టిన తేదీ మీ వ్యక్తిత్వం, అలవాట్లు, ప్రవర్తన, ఆలోచనలు, తెలివితేటలు, మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారు అనేది తెలియజేస్తుందంటారు. ఏ నెలలో అయినా ఈ తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారో చూద్దాం..
21వ తేదీ
మీరు చాలా క్రియేటివ్ గా ఉంటారు. సక్సెస్ అవడానికి చాలా కష్టపడతారు. ఇతరులతో తొందరగా కలసిపోతారు. రైటింగ్, వెర్బల్ స్కిల్స్ ఉంటాయి. ఎదుటివారిని ప్రోత్సహిస్తారు.
22వ తేదీ
నాయకుడిగా, ఆర్గనైజర్ గా రాణిస్తారు. వీరికి సక్సెస్ అవ్వాలనే లక్ష్యం ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ పై ఆధారపడి ఉంటారు. చాలా ప్రాక్టికల్, ఆదర్శవాదులుగా ఉంటారు.
23వ తేదీ
జీవితం ఓ అడ్వెంచర్ దాన్ని పూర్తిగా అనుభవించాలనే ఆలోచనలో ఉంటారు. వ్యక్తిగత అనుభవాలు చెప్పి ఇతరుల ముందు లోకుల కావాలని అస్సలు అనుకోరు. చాలా సర్దుకుపోయే తత్వం ఉంటుంది. బంధాలను తొందరగా కలిపేసుకుంటారు. మీ జీవితంలో చాలామంది ఉంటారు.
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
24వ తేదీ
మీరు ఫ్యామిలీ ఓరియెంటెడ్. కుటుంబానికి ఎక్కువ ప్రయార్టీ ఇస్తారు. వీళ్లు చాలా ఎమోషన్, సెన్సిటివ్ నేచర్ కలిగి ఉంటారు. తమకు తెలిసిన వారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే చాలు ఓదార్చేందుకు అస్సలు ఆలోచించరు. ప్రణాళికాబద్ధంగా ఉండటం వల్ల వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు.
25వ తేదీ
లైఫ్ ని లాజికల్ గా ఆలోచిస్తారు. ఏదైనా ఒక విషయంపై పూర్తీగా పరిశీలించే సత్తా వీరి సొంతం. సైన్స్, టీచింగ్, ఫిలాసఫీ, మెటాఫిజిక్స్, సైకాలజీలో బాగా సక్సెస్ అవుతారు.
26వ తేదీ
వ్యాపారంలోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతారు. మీరు ఏం చేసినా జడ్జిమెంట్ కోరుకుంటారు. మంచి మ్యానేజర్, ఆర్గనైజర్. ముందుచూపు కలిగి ఉంటారు. కానీ కొన్ని వివరాల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయగలుగుతారు.
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
27వ తేదీ
మీరు పుట్టుకతోనే లీడర్ గా ఉంటారు. మ్యానేజ్, ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు. రాజకీయాలు, న్యాయ రంగాల్లో రాణిస్తారు. అందర్నీ బాగా అర్థం చేసుకుంటారు. చాలా కళాత్మకంగా ఉంటారు.
28వ తేదీ
లీడర్ షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవరో ఒకరి కోపరేషన్ తోనే అవి పనిచేస్తాయి. స్వతంత్ర భావం కలిగి ఉంటారు.సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. కానీ ప్రోత్సాహం ఉండాల్సిందే.
29వ తేదీ
మీరు కళాత్మకంగా ఉంటారు. మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. క్రియేటివ్ గా ఆలోచిస్తారు.
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
30వ తేదీ
వీరు చాలా తెలివైన వాళ్లు. రైటింగ్, ఆర్ట్స్ లో మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. ఊహలని ప్రజెంట్ చేయడంలోవీరికి వీరే సాటి.
31వ తేదీ
కుటుంబం, సంప్రదాయం, కమ్యునిటీపై చాలా ప్రేమ ఉంటుంది. ఏ పనిచేసినా పట్టుదలతో చేస్తారు. మ్యానేజర్, ఆర్గనైజర్ గా రాణిస్తారు. ప్రతి విషయంలో వివరణ కోరుకుంటారు. కష్టపడి పనిచేస్తారు.
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Numerology: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ABP Desam
Updated at:
11 Dec 2021 06:57 AM (IST)
Edited By: RamaLakshmibai
పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. పుట్టిన తేదీ మీ వ్యక్తిత్వం, అలవాట్లు, ప్రవర్తన, ఆలోచన, తెలివితేటలు, ఏ రంగంలో సక్సెస్ అవుతారన్నది తెలియజేస్తుందట..
Nnumerology
NEXT
PREV
Published at:
11 Dec 2021 06:57 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -