'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా?' సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ కాపీ అంటూ నెటిజన్స్ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్, 'ఊ అంటావా...' పాటలో సమంత
స్పెషల్ సాంగ్స్ చేయడంలో దేవి శ్రీ ప్రసాద్ స్టయిల్ సపరేట్. ఆయన కంపోజ్ చేసిన ఎన్నో ట్యూన్స్ ట్రెండ్ క్రియేట్ చేశాయి. అటువంటి దేవి శ్రీ ప్రసాద్... ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఆయన పాట ఎక్కడో విన్నట్టుందని, ఓ తమిళ సినిమాలో పాటను కాపీ చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప: ద రైజ్'కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్‌లో 'రంగస్థలం' ఫ్లేవర్ ఉందని కొంతమంది కామెంట్ చేశారు. అది పక్కన పెడితే... అల్లు అర్జున్ అభిమానులకు, ప్రేక్షకులకు పాటలు నచ్చాయి. లేటెస్ట్‌గా 'ఊ అంటావా? ఊ ఊ అంటావా?' సాంగ్ రిలీజ్ చేశారు. సమంత స్టెప్పులు వేసిన ఈ స్పెషల్ సాంగ్ కాపీ అనేది నెటిజన్స్ టాక్.
Also Read: మావా... ఊ అంటావా? ఊ ఊ అంటావా? సమంత సాంగ్ వచ్చేసింది. చూశారా?తమిళ హీరో సూర్య నటించిన 'వీడోక్కడే' సినిమా ఉంది కదా! అందులో 'హానీ హానీ...' అని ఓ స్పెషల్ సాంగ్ ఉంది. దానిని దేవి శ్రీ ప్రసాద్ కాపీ చేశాడనేది నెటిజన్స్ కామెంట్. ఆ పాట, ఈ పాట సేమ్ ఉన్నాయని అంటున్నారు. ఈ కాపీ కామెంట్స్ మీద దేవి శ్రీ ప్రసాద్, 'పుష్ప' టీమ్ ఎలా స్పందిస్తాయో చూడాలి.