'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్రీకరణలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని దర్శక ధీరుడు రాజమౌళి సరదాగా వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్ 300 రోజులు చేసి ఉంటే... కనీసం 25 రోజులు వేస్ట్ అయ్యాయని ఆయన తెలియజేశారు. ప్రెస్‌మీట్‌ లైవ్ వీడియో ఎవరైనా చూసి ఉంటే... ఆ మాటలు చెప్పిన తర్వాత రాజమౌళి ఒక్కసారిగా సోఫా లోనుంచి లేచి పక్కకి వెళ్లి నిలబడ్డారు. ఎందుకో తెలుసా? ఎన్టీఆర్ ఆయన్ను చిలిపిగా గిల్లారు. కితకితలు పెట్టారు. అందుకని, సోఫా లోంచి లేచి పక్కకు వెళ్లారన్నమాట.ప్రెస్‌మీట్‌లోనే కాదు... సెట్‌లో కూడా అదే విధంగా ప్ర‌వ‌ర్తించార‌ని రాజమౌళి తెలిపారు.


"వీళ్లిద్దరి (ఎన్టీఆర్, చరణ్) మూలంగా వేస్ట్ అయిన షూటింగ్ డేస్ ఒక 20, 25 ఉంటాయి. ఇద్దరికీ 30 ఏళ్లు వచ్చాయి. పెళ్లిళ్లు అయ్యాయి. వెనుకాల బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోట్లమంది 'అన్నా చచ్చిపోతాం' అంటున్నారు. సెట్‌లో 'జక్కన్నా! చరణ్ గిల్లుతున్నాడు' అని ఎన్టీఆర్ వచ్చి కంప్లయింట్ చేస్తాడు. చరణ్ ఏమో అమాయకంగా ముఖం పెట్టి 'లేదే... నేను నా లైన్స్ చూసుకుంటున్నాను' అంటాడు. 'లేదు జక్కన్నా... గిల్లాడు' అని ఎన్టీఆర్, 'లేదు... నేను గిల్లలేదు' అని ఎన్టీఆర్... పది పదిహేను నిముషాలు అలాగే జరుగుతుంది" అని రాజమౌళి చెబుతున్నారు. ఆయన మాటలకు ఎన్టీఆర్ అడ్డు తగిలారు.


రాజమౌళితో "మీరు చూడలేదా? మీరు ఏం చేశారు? నవ్వడం తప్ప! ఈ రోజు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నారు. ఆ రోజు ఏం చేశారు? ఆపారా?? నా మీద దాడిని ఆపారా? మీరు ఖండించారా?" అని ఎన్టీఆర్ అన్నారు. ఆయన సరదాగా అన్నారని అందరికీ తెలుసు. దాంతో ఒక్కసారిగా ఆడిటోరియం అంతా నవ్వులు విరిశాయి. దాడి అనడంతో చరణ్ ఒక్కసారిగా సోఫా లోంచి లేచి రాజమౌళి పక్కన నిలబడ్డారు. 'ఈవ్ ఆరు దాడి చేశారు చెప్పు?' అని ఆయన కూడా నవ్వేశారు. అంతటితో ఆగలేదు. హీరోలు ఇద్దరినీ మీడియా ఫొటోస్ కోసం ఫోజు ఇవ్వమని అన్నప్పుడు... ఎన్టీఆర్‌ను గిల్లారు. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది.


'ఆర్ఆర్ఆర్' ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్నేహం చూసిన తర్వాత ఫ్యాన్స్, ముఖ్యంగా సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్లు సైలెంట్ అవుతారని ఆశించవచ్చు. తమ స్నేహం గురించి కూడా ఇద్దరూ గొప్పగా మాట్లాడారు. తమ ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే అనీ, కరోనా సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు తరచూ కలిసేవారమని ఎన్టీఆర్ అన్నారు. 'ఆర్ఆర్ఆర్' వల్ల తామిద్దరం స్నేహితులం కాలేదని, అంతకు ముందు నుంచి తమ మధ్య స్నేహం ఉందని రామ్ చరణ్ చెప్పారు. నిజ జీవితంలో తామిద్దరం స్నేహితులుగా నటించడం లేదన్నారు.

Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఫ్రెండ్స్‌తో ఎన్టీఆర్ మాట్లాడతారా?
Also Read: దేవిశ్రీ ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా? ఊ అంటారా... ఉఊ అంటారా?
Also Read: 'న‌యీం డైరీస్‌'పై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం... టీమ్ ఏమంటోందంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి