శుక్రవారం రోజు కూడా రిషి-వసుధార చాటింగ్ తో ఎపిసోడ్ ప్రారంభమైంది. ఏదో చెబుతాఅన్నారు అని వసు అడిగితే మరిచిపోయా అని రిషి మెసేజ్ పెడతాడు. ఇగో ఎక్కువ అంటూ చికాకుగా మొహం పెట్టిన వసుధార సర్ ఇంకేంటి విశేషాలు అని మెసేజ్ పెడుతుంది. ఇంకేంటి విశేషాలా? అని రిషి తనలో తాను అనుకుని.. గుడ్ మార్నింగ్ వసుధార అని మెసెజ్ పెడతాడు. నేను ఏం చెప్పాలని అనుకున్నాను అని ఆలోచనలో పడిన రిషి ఎన్నైనా అనుకుంటాం కానీ చెప్పలేం కదా?. రోజంతా కలిసి తిరిగాం.. కానీ నాకు ఎక్కడా అలసట అనిపించలేదు ఇదంతా వన భోజనాల మహిమా? వసు మహిమా? అని రిషి అనుకుంటాడు. రిషి సర్ అప్పుడే బాగుంటారు, అప్పుడే మూడ్ మారుతుంది.. ఇంతకీ ఏం చెప్పాలని అనుకున్నారు..అని ఆలోచిస్తూ సెల్ఫీని రిషికి పంపిస్తుంది. సెల్ఫీ ఫోటో చూసి రిషి అలాగే వదిలేసి పడుకుంటాడు. ఉదయాన్నే రిషి గదిలోకి ఎంట్రీ ఇచ్చిన దేవయాని రిషి ఫోన్లో ఫొటో కనిపిస్తుంది. పూర్తిగా చూద్దాం అనుకునేలోగా మహేంద్ర కాఫీతో వచ్చి ఆ ప్రయత్నాన్ని చెడగొడతాడు. గుడ్ మార్నింగ్ రిషి అనడంతో రిషి కూడా నిద్రలేస్తాడు. ఫోన్‌లో ఏదో ఫోటో ఉంది చూద్దాం అనుకునేలోగా మహేంద్ర డిస్టబ్ చేశాడనుకుంటుంది దేవయాని. రాత్రి చాలాసేపు ఎదురుచూసి పడుకున్నా నువ్వు ఎప్పుడు వచ్చావ్ అని అడుగుతుంది దేవయాని. అవును రిషి నీ కోసం చాలా సేపు ఎదురుచూసింది.. నేను కూడా ఎదురుచూడటం లేదని అంది అంటూ దేవయాని మీద మహేంద్ర సెటైర్లు వేస్తాడు. ఇలా ఆలస్యంగా పడుకుంటే నీ ఆరోగ్యం ఏమవుతుందని దేవయాని అంటుంది.
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
ఇంతలో రిషి... పొద్దున్నే ఇలా ఇద్దరూ కనిపించడం విచిత్రంగా ఉందంటాడు. వదిన గారికి నువ్వంటే అభిమానం, ఎటు వెళ్తున్నావ్.. ఏమై పోతున్నావో అని ఆందోళన చెందుతున్నారు.. అని మహేంద్ర కౌంటర్లు వేస్తాడు. నీ కోసమే ఈ ఆందోళన.. ఆరా తీయడం లేదు.. అని దేవయాని కవర్ చేస్తుంది. పొద్దున్నే లేనిపోనివ్ కల్పించి చెబుతున్నావ్ ఏంటి మహేంద్ర అంటుంది దేవయాని . మీరు పెద్దవారు ఎలాగంటే అలాగే.. అని మహేంద్ర అంటాడు. కాఫీ ఇవ్వడంతో రిషి థ్యాంక్స్ డాడ్ అని అంటాడు. మరి వదిన మీరు నాకు చెప్పరా? థ్యాంక్స్ అని మహేంద్ర అంటాడు. నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి.. అన్నీ కలిపి చెబుతాను అని దేవయాని సైటైర్ వేస్తుంది. మీరు తిట్టినా కూడా ఆశీర్వాదమే అని మహేంద్ర అంటూనే.. పొద్దున్నే ఇలా వచ్చిందంటే ఆరా తీయడానికే అయి ఉంటుంది అని లోలోపల అనుకుంటాడు.. నేను వచ్చానని వచ్చాడా? లేదా నార్మల్‌గానే వచ్చాడా?.. మొత్తానికి మహేంద్ర మాత్రం నా ప్రయత్నానికి అడ్డుకట్ట వేశాడు అని దేవయాని మనసులో అనుకుంటుంది.
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
బయట ఎక్సర్‌సైజ్ చేస్తున్న మహేంద్ర..పుత్రరత్నం ఇంకా రాలేదేంటి అనుకుంటూ ఉంటాడు. పొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నట్టున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు. పనులుంటాయ్ కదా? నన్ను ఒకరు రమ్మన్నారు డాడ్.. అక్కడికి వెళ్తున్నాను..అని ఏదో చెప్పేస్తాడు రిషి. మహేంద్ర అనుమానంగా చూస్తుంటే.. ఏంటి అలా చూస్తున్నారు.. మన పార్కులో జాగింగ్ క్లబ్ వాళ్లు రమ్మన్నారు.. అని రిషి అబద్దం చెబుతాడు. ను కూడా వస్తాను అంటూ మహేంద్ర పట్టుబడతాడు. నన్ను పిలిచారు నన్న రుమ్మన్నారు మిమ్మల్ని తీసుకెళ్తే బాగుండదు అని రిషి అంటే.. అంతో ఇంతో నాకు గుర్తింపు ఉంది.. చుట్టుపక్కల వాళ్లు రిషి ఫాదర్‌గా గుర్తు పడతారు అని మహేంద్ర అంటాడు. గుర్తింపు ఉంది కదా? రావడం ఎందుకు.. అని అంటాడు రిషి. నువ్ వాళ్లతో ఏం మాట్లాడతావో వింటాను అని మహేంద్ర అంటాడు. పోనీ కారులో కూర్చుంటాను.. నువ్ మాట్లాడేది వింటాను అని అంటాడు. నేనేం మాట్లాడతానో మీరు వినాలి అంతే కదా?.. ఫోన్‌లో రికార్డ్ చేస్తాను.. వచ్చాక వినిపిస్తాను. అని రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కొడుకు మనసు తెలిసిన మహేంద్ర.. మై డియర్ పుత్ర.. నేను మీ డాడ్‌ని.. అసలు మన కాలనీలోని జాగింగ్‌కు క్లబ్బే లేదు. ఎదిగిన కొడుకు అబద్దం చెబుతున్నాడంటే.. పక్కదారి పడుతున్నాడని లేదా? ప్రేమలో పడ్డట్టున్నాడని అర్థం. మొదటిది ఎలాగూ చేయడు రెండోదే అనుకుంటా మంచిదే కదా? అని లోలోపల అనుకుంటాడు
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
కారు హార్న్ సౌండ్ వినడంతో రిషి సర్ వచ్చాడని వసు మొహం వెలిగిపోతుంది. కొత్తగా కారు హార్న్ సౌండ్ వినిపిస్తోంది ఏంటని జగతి ఆశ్చర్యపోతోంది. ఇక రిషి కారు సౌండ్ హార్న్ వినబడటంతో ఫ్లవర్ వాజ్‌లోపెట్టాల్సిన ఆ పూలను అలానే పట్టుకుని బయటకు వచ్చింది వసు. ఏంటి ఫ్లవర్లతో కొత్తగా స్వాగతం ఇస్తున్నావ్.. అని రిషి అడుగుతాడు. నిజం చెప్పినా ఎలాగూ నమ్మరు కదా? అని వసు తనలో తానే అనుకుంటుంది. తీసుకోండి సర్ అని ఆ పూలను ఇస్తుంది. నో థ్యాంక్స్ అంటూ రిషి వాటిని తీసుకోడు.. ఎందుకు వచ్చానో అడగవా అని రిషి అంటాడు. అలా ఎలా అడుగుతాను సర్ అని వసు అంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఓ ఐడియా వచ్చింది..అది చెబుదామనే వచ్చాను అంటాడు. బయట నిల్చో బెట్టే మాట్లాడతావా? పైగా ఇది కాఫీ తాగే టైం కదా? అని జగతి అంటుంది. నేను కాఫీ తాగే వచ్చాను.. అని వసుధారకు చెబుతాడు. కాఫీ తాగకున్నా లోపలకు రావొచ్చు కదా?. పైగా ఏదో ఐడియా వచ్చిందని అన్నారు అంటూ రిషిని లోపలకి పిలుస్తుంది వసు. షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని రిషి ఇచ్చిన బాగుందని వసు అంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్స్‌కు సంబంధించిన కాన్సెప్ట్ మీరు చేయండి మేడం అంటూ రిషి చెబుతాడు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు.. మేడం అదిరిపోయే డిజైన్లు చేస్తారు అని వసు అంటుంది. మరి నువ్ ఏం చేస్తావ్ అని వసుపై రిషి సెటైర్లు వేస్తాడు. నేను మేడంకు హెల్ప్ చేస్తాను సర్ అని వసు అంటుంది. ఇక రిషి వెళ్లిపోతూ ఉంటే.. ఐడియా చాలా బాగుంది సర్ అని మళ్లీ వసు అంటుంది. ఇంతకుముందే చెప్పావ్ కదా అంటాడు రిషి మళ్లీ చెప్పాలని అనిపించింది సర్ అంటుంది. ఇక రిషి వెళ్లిపోతాడు. ఏంటి వసు.. ఒకసారి చెప్పావ్ కదా?.. అని జగతి కూడా అంటుంది. ఇంకోసారి చెప్పాలనిపించింది.. మేడం అని వసు అంటుంది. రిషి.. వసుధార తెలివిని ఇష్టపడ్డాడా? వసుధారని కాదా?.. వీళ్లిద్దరు ఏంటో ఒక్కోసారి అర్థం కారు అని అంటుంది జగతి.
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
ఏంటి వసు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయ్ కదా? నెక్ట్స్ ప్లాన్స్ ఏంటిని అడుగుతుంది జగతి. ఏమీ లేవు మేడం.. అంటుంది వసుధార. అదే సమయంలో జగతి ఇంటికొచ్చిన దేవయాని అసలేమని అనుకుంటున్నారు అంటుంది. ఏమైందక్కయ్యా అని జగతి అడుగుతుంది. అర్దరాత్రుళ్లు ఎటు తిరుగుతున్నారు.. ? అని వసుని దేవయాని అడుగుతుంది. ఇదే ప్రశ్న రిషి సర్‌ని అడగలేకపోయారా? నన్ను ఎందుకు అడుగుతున్నారని వసు రివర్స్‌లో కౌంటర్ వేస్తుంది. ఏం జగతి మీ శిష్యురాలికి బాగానే ట్రైనింగ్ ఇస్తున్నావ్ అని దేవయాని అంటుంది. ట్రైనింగ్ ఏంటి?.. వసు అడిగిన దాంట్లో తప్పేముంది? వాళ్లు కాస్త లేటుగా వచ్చారు అంతే కదా? అని జగతి అంటుంది. అదే లేటుగా ఎందుకు వచ్చారని అంటున్నాను.ఇదంతా నువ్ ఆడిస్తున్న నాటకమే.. నీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది.. కదా? అని దేవయాని అంటుంది. నాటకాలు ఎవ్వరూ ఆడటం లేదు.. నాటకాలు ఎవరు ఆడతారో అందరికీ తెలుసులేండి మేడం అని వసు అంటుంది. ఏయ్ వసు అలా అనొద్దు నేను మాట్లాడుతున్నాను కదా? అని జగతి అంటుంది. మన ఇంటి దగ్గరకి వచ్చి మనల్నే అన్నప్పుడు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు ఆగాలి మేడం అంటుంది వసు.
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
తన మనసులో ఏముందో నాకు తెలుసు.. మనల్ని రెచ్చగొట్టేందుకు వచ్చిందని దేవయాని గురించి జగతి చెబుతుంది. కరెక్ట్‌గానే ఆలోచించావ్ నువ్ ఆ ఇంటి గడప తొక్కలేవు ఎప్పుడైతే ఆ ఇంటి గడప దాటి వచ్చావో అదే నీకు ఆఖరి రోజైంది అనవసరంగా ఆశలు పెంచుకోకని జగతిని దేవయాని హెచ్చరిస్తుంది. ఇన్నేళ్లైనా మీ పద్దతి, మాటలు మారలేదని జగతి కౌంటర్లు వేస్తుంది. నేను ఆవేశపడతాను, నేను బడబడా మాట్లాడేస్తాను, నువ్ ఆలోచించి మాట్లాడతావ్ రిషి మనసులో నువ్ లేవు లేకుండా చేశాను అంటూ దేవయాని రెచ్చిపోతుంది. అలా ఎపిసోడ్ ముగిసింది.
రేపటి ఎపిసోడ్‌లో
దేవయాని చేయబోయే రచ్చను రిషి కళ్లారా చూడబోతోన్నట్టు కనిపిస్తోంది. రెస్టారెంట్‌లో జగతి, వసు ఉంటారు. రిషి నిన్ను కలవమని చెప్పాడు కదా?. కలవకపోతే కోపం వస్తుంది కదా అని వసుతో జగతి అంటుంది. కోపం రావాలని కలవలేదు మేడం అని వసు అంటుంది. జగతి అత్తయ్య, వసులు ఎక్కడుంటారు అని అడిగి దేవయాని అత్తయ్య అడిగి మరి బయటకు వెళ్లిందంటూ మహేంద్రతో ధరణి అంటుంది. ఈ మాటలన్నీ రిషి వింటాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ రెస్టారెంట్‌లో ఉంటారని రిషి కూడా అక్కడికే బయల్దేరుతాడు. ఈ లెక్కన ఏ రేంజ్ లో రచ్చజరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Guppedantha Manasu Serial Today Episode: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
ABP Desam
Updated at:
10 Dec 2021 09:20 AM (IST)
Edited By: RamaLakshmibai
గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్ లో రిషి వసు ప్రేమలో మరో అడుగేసినట్టే ఉంది. అర్థరాత్రి వరకూ చాటింగ్ చేసిన రిషి పొద్దున్న వసుని కలిసేందుకు వెళ్లడం..వసు రెడ్ రోజెస్ తో వెల్ కమ్ చెప్పడం అదుర్స్.
image credit / Star Maa Hot Star
NEXT
PREV
Published at:
10 Dec 2021 09:20 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -