మేషం
మీ బాధ్యతలు పూర్తిచేయగలుగుతారు.  ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాల సమాచారం అందుతుంది. ఉద్యోగులకు శుభసమయం.
వృషభం
ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు మీరు అప్రమత్తంగా వ్యవహరించండి. రోజంతా బిజీ  బిజీగా ఉంటారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు ఖర్చులు ఎక్కువ అవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి.  మీ ప్రవర్తనలోని కిఠినత్వాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. 
మిథునం
కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.  ఖర్చులు పెరుగుతాయి. ఇంటి బాధ్యతలు నిర్వర్తించగలుగుతారు. విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి.  పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. స్నేహితుల సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
కర్కాటకం
రోజంతా చికాకుంగా ఉంటారు. సరైన పని లేకపోవడ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి. అవసరమైన సమయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోండి.  ఆర్థిక పరిస్థితి బావుంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావొచ్చు.
సింహం
వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవరితోనైనా అనవసర వివాదాలు ఉండొచ్చు.  మీ బాధ్యతను నెరవేర్చడంలో కొంత అసమర్థత ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం.
కన్య
స్నేహితులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ వ్యవహారాల్లో సౌలభ్యం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Also Read: ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యాన్నిచ్చే వ్రతం ఇది..
తుల
విజయం వరిస్తుంది.  వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణంలో ఎవరితోనైనా గొడవలు రావచ్చు. మాటలు అదుపులో ఉంచుకోండి.  అసభ్య పదాలు వాడొద్దు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.  విద్యార్థులు శుభవార్త వింటారు.  వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు.
వృశ్చికం
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. బంధువుతో వివాదాలు తలెత్తవచ్చు. స్థిరాస్తి విషయంలో ఒత్తిడి ఉంటుంది. మీ పని బాగా జరుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఎప్పటి నుంచో నిలుపుదల చేసిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.
ధనుస్సు
వ్యాపారంలో లాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావొచ్చు. ఈరోజు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడి తగ్గుతుంది.  స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధువులను కలుస్తారు. కారణం లేకుండా ఖర్చు చేయడం మానుకోండి.
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
మకరం 
సామాజిక బాధ్యత ఉంటుంది. కొన్ని పనులపై ఇతర నగరాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వస్తువనరులను సమీకరించుకోవచ్చు. ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ వైపు చూడొద్దు. స్థిరాస్తులు కొనాలనే ఆలోచనను విరమించుకోండి. ఉద్యోగులకు సాధారణంగా ఉంటంది. కుటంబంలో సంతోషం నెలకొంటుంది. 
కుంభం
మరింత కష్టపడాల్సి వస్తుంది. ఈరోజంతా మీకు బావుంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు మంచి రోజుయ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  వివాదాలకు దూరంగా ఉండండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి.
మీనం
ఒకేసారి ఎన్నో  బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఏపని చేసినా లాభం ఉంటుంది. మీ ప్రవర్తనకతో అందర్నీ ఆకట్టుకుంటారు. కుటుంబానికి సమయం వెచ్చించండి.  ఆరోగ్యం బాగుంటుంది. దినచర్యలో మార్పులు చేసుకోవచ్చు.
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!

  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి