వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ సీఈ 5జీ స్మార్ట్ ఫోన్లపై ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఐసీఐసీఐ బ్యాంకు డిస్కౌంట్లు అందించారు. వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేస్తే ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులకు రూ.13,000 వరకు తగ్గింపు లభించనుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీపై రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. ఈ డీల్స్ అన్నీ వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌ల్లో లిస్ట్ అయ్యాయి.


వన్‌ప్లస్ 9 ప్రో డీల్
వన్‌ప్లస్ 9 ప్రోను ఐసీఐసీఐ బ్యాంకు కార్డు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీనిపై తొమ్మిది నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. వన్‌ప్లస్.ఇన్, అమెజాన్ వెబ్‌సైట్లలో ఈ డీల్ లిస్ట్ అయింది. దీంతోపాటు రూ.5,000 కూపన్ కూడా లభించనుంది. ఈ డీల్ చెకౌట్ చేసే సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఈ రెండు ఆఫర్లనూ కలిపితే దీనిపై రూ.10,000 వరకు తగ్గింపు లభించనుంది.


వన్‌ప్లస్ 9 డీల్
వన్‌ప్లస్ 9 స్మార్ట్ ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.8,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. దీంతోపాటు రూ.5,000 కూపన్ కూడా అందించనున్నారు. అంటే ఈ ఫోన్‌పై మొత్తంగా రూ.13,000 వరకు తగ్గింపు లభించనుందన్న మాట. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ డీల్
ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, ఈఎంఐ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభించనుంది. దీనిపై మూడు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ వెబ్‌సైట్, అమెజాన్ వెబ్‌సైట్లలో ఈ డీల్ అందుబాటులో ఉంది.


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి